HOME »NEWS »MOVIE »a man has revealed how he got married to priyanka chopra even shared throwback picture ta

నిక్ జోనస్ కంటే ముందు ప్రియాంకకు పెళ్లైందా.. సాక్ష్యాలు బయటపెట్టిన వ్యక్తి..

నిక్ జోనస్ కంటే ముందు ప్రియాంకకు పెళ్లైందా.. సాక్ష్యాలు బయటపెట్టిన వ్యక్తి..
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ (Instagram/Photo)

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంతో ఏడుడగులు వేసి 2018 చివర్లో ఒక్కటయ్యారు. ఇక ప్రియాంక చోప్రాకు నిక్ జోనస్ కంటే ముందు మరో వ్యక్తితో ఇది వరకే పెళ్లైందా.

  • Share this:
    ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంతో ఏడుడగులు వేసి 2018 చివర్లో ఒక్కటయ్యారు. ఇక ప్రియాంక చోప్రాకు నిక్ జోనస్ కంటే ముందు మరో వ్యక్తితో ఇది వరకే పెళ్లైందా. అంటే ఓ సంఘటనను గుర్తు చేసుకోవాలి. 2014లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ప్రియాంకకు బ్రాండన్ షుష్టర్ అనే వ్యక్తి పూలమాల వేసి స్వాగతం పలికాడు. అంతే కాకుండా సదరు వ్యక్తి ప్రియాంకతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలు ఆ తర్వాత సోషల్ మీడియాతో పాటు చాలా  మ్యాగజైన్స్‌తో పా‌టు అన్ని మీడియాల్లో ప్రసారం అయ్యాయి. ఇక వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకొని వారిద్దరికి పెళ్లై అయినట్టు వార్తలు ప్రచురించారు. దీంతో బ్రాండన్ ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. అప్పట్లో చాలా మీడియా సంస్థలు ఆయన్ని స్పెషల్‌గా ఇంటర్వ్యూ‌లు కూడా చేశాయి.


    బ్రాండన్ అప్పట్లో జరిగిన ఆ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ట్విట్టర్‌లో ప్రియాంకతో దిగిన అప్పటి ఫోటోను షేర్ చేసాడు. అక్కడ లోకల్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రియాంకను గ్రీన్ కార్పెట్‌పై వెల్కమ్ చెబుతూ పూల మాలను మెడలో వేసాను. అయితే భారతీయు సంప్రదాయం ప్రకారం పూల మాలను పెళ్లిలో వేయడం అనేది ఓ భాగం అనేది నాకు తర్వాత తెలిసింది. అలా నేను పూల మాల వేయడంతో ప్రియాంకకు నాకు పెళ్లి జరిగినట్టు కొన్ని మీడియాలు ఊదరగొట్టాయని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:May 02, 2020, 19:59 IST