Home /News /movies /

A MAN DIED IN THE KGF 2 CINEMA THEATRE IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS SR

KGF Chapter 2 : కెజియఫ్ సినిమా చూస్తూ వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు..

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 Photo : Twitter

KGF Chapter 2 : ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. అది అలా ఉంటే సోమ‌వారం ఏపీలోని ఏలూరు న‌గ‌రంలో ఈ సినిమా చూస్తూ ఓ వ్య‌క్తి థియేట‌ర్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  KGF Chapter 2 Collections | Yash : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ మూడేళ్ల కింది వరకు కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక కెజియఫ్‌తో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్ (Yash).. ఇప్పుడు కెజియఫ్ 2 (KGF Chapter 2) మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్‌లో టాక్ తెచ్చుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బద్దలు కొడుతూ కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. సోమ‌వారం ఏపీలోని ఏలూరు న‌గ‌రంలో ఈ సినిమా చూస్తూ ఓ వ్య‌క్తి థియేట‌ర్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు థియేట‌ర్‌కు చేరుకుని మృత‌ దేహాన్ని శ‌వ ప‌రీక్ష కోసం ఏలూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్య‌క్తి ఏ కార‌ణంతో చ‌నిపోయాడన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉందని అంటున్నారు పోలీసులు.

  ఇక కెజియఫ్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా హిందీలో 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1129 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళని అందుకున్నట్టుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో ఈ ఏడాదిలో రెండో 1000 కోట్ల సినిమాగా కెజియఫ్ నిలిచింది. అంతేకాదు ఇండియాలో బాహుబలి 2, దంగల్, రౌద్రం రణం రుధిరం చిత్రాల తర్వాత ఆ క్లబ్‌లో చేరిన నాలుగవ సినిమాగా కెజియఫ్ 2 నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా మొత్తంగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. బ్రేక్ ఈవెన్ పూర్తి అయ్యి.. ఇప్పుడు లాభాల బాటలో నడుస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెజియఫ్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. మరో సినిమా కూడా రాబోతుందని టాక్. తాజాగా విడుదలైన కెజియఫ్-2 క్లెమాక్స్‌లో పార్ట్‌-3  (KGF Chapter 3) ఉండబోతుందని హింట్‌ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

  Mahesh Babu : సర్కారు వారి పాట ప్రిరిలీజ్ బిజినెస్ ఎంత.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత వసూలు చేయాలి..

  మూడో భాగంలో రాఖీ భాయ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో పవర్‌ చూపించనున్నాడట. పార్ట్ 3లో (KGF Chapter 3) రాఖీ భాయ్‌ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించనుందని టాక్. KGF మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌తో రెండో పార్ట్‌ను మరింత పకడ్బందీగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే ఈ సినిమాలో పలు భాషలకు చెందిన నటీనటులు నటించారు. KGF 2లో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిని ఈసినిమాలో హిందీ బడా హీరో సంజయ్ దత్‌తో (Sanjay Dutt) అథీరా పాత్ర కోసం తీసుకున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో (Raveena Tandon) రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేశారు.  క‌న్న‌డ న‌టి శ్రీ నిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగండూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: KGF Chapter 2, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు