విశాల్‌ను మోసం చేసిన మహిళ.. 45 లక్షలు చోరీ..

Vishal: తమిళ ఇండస్ట్రీలో విశాల్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. దాంతో పాటే ఇండస్ట్రీలో రాజకీయాలు కూడా చేస్తుంటాడు. ఈయన నడిగర్ సంఘంలో కీలక వ్యక్తి కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 5, 2020, 5:25 PM IST
విశాల్‌ను మోసం చేసిన మహిళ.. 45 లక్షలు చోరీ..
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)
  • Share this:
తమిళ ఇండస్ట్రీలో విశాల్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. దాంతో పాటే ఇండస్ట్రీలో రాజకీయాలు కూడా చేస్తుంటాడు. ఈయన నడిగర్ సంఘంలో కీలక వ్యక్తి కూడా. ఇదిలా ఉంటే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఎప్పుడూ సినిమాలు నిర్మిస్తూనే ఉంటాడు ఈ ప్రముఖ హీరో. ఇప్పుడు విశాల్‌ను ఓ మహిళ మోసం చేసింది. ఆయన కంపెనీలోనే పని చేస్తూ ఆరేళ్లుగా లక్షలకు లక్షలు మోసం చేసింది. విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ ప్రొడక్షన్‌ కంపెనీలో పనిచేసే ఓ మహిళ ఆరేళ్ల కాలంలో దాదాపు 45 లక్షలు దోచేసినట్లు తెలిసింది. ఆమె భారీగా ఓ ఇల్లు కొనడంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి.
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)


ఆరా తీస్తే విశాల్ కంపెనీ నుంచి లక్షలు దారి మళ్లించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు విశాల్‌ మేనేజర్‌ ఈ మధ్యే చెన్నైలోని విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ కోసం కట్టాల్సిన డబ్బులను తన సొంత అకౌంట్‌కు బదిలీ చేసి ఆరేళ్లలో ఇన్నేసి లక్షలు పోగు చేసింది. దాంతో ఆమెపై కేసు కూడా ఫైల్ అయిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చక్ర సినిమాతో బిజీగా ఉన్నాడు విశాల్. ఈ సినిమాను ఎంఎస్ ఆనందన్ తెరకెక్కిస్తున్నాడు.
విశాల్ చక్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)
విశాల్ చక్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

డిజిటల్ వరల్డ్‌లో జరుగుతున్న మోసాలపై ఈ చిత్రం వస్తుంది. దాంతో పాటే తుప్పరివాలన్‌ 2 చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు విశాల్. ఈ సినిమా 2021లో విడుదల కానుంది. డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ ఇది. ఇప్పటికే విడుదలైన చక్ర ట్రైలర్ అద్భుతమైన రెస్సాన్స్ తెచ్చుకుంది. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి తన కంపెనీలోనే పని చేస్తూ కన్నం వేసిన ఇంటి దొంగను విశాల్ మేనేజర్ గుర్తించాడు.
Published by: Praveen Kumar Vadla
First published: July 5, 2020, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading