సుశాంత్ మరణం తట్టుకోలేక తెలుగమ్మాయి ఆత్మహత్య..

Sushant Singh Rajput: బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుని మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రేక్షకులు కూడా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2020, 3:23 PM IST
సుశాంత్ మరణం తట్టుకోలేక తెలుగమ్మాయి ఆత్మహత్య..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ని గుర్తు చేసుకుని మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమా ప్రేక్షకులు కూడా ఈయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం జీర్ణించుకోలేక ఆయన అభిమానులు కూడా తనువు చాలిస్తున్నారు. ఇది అందర్నీ కలవరపెడుతుంది. ఆయనపై ఉన్న అభిమానంతో కొందరు అభిమానులు తమ హీరో మాదిరే ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా మల్కాపురంలో జూన్ 19న చోటు చేసుకుంది.

ప్రతీకాత్మకచిత్రం
ప్రతీకాత్మకచిత్రం


మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్‌పుత్ర నగర్‌లోని సుమన్‌ కుమారికి టిక్‌ టాక్‌ వీడియోలు చూడటం బాగా అలవాటు. ఈ మధ్యే డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ మరణం గురించి ఈమె తరుచూ టిక్‌టాక్‌లో చూస్తూనే ఉంది. దాంతో ఈమె కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. సాధారణంగా సుశాంత్‌కు వీరాభిమాని అయిన కుమారి.. ఆయనలాగే ఆత్మహత్య చేసుకుంది.

ప్రతీకాత్మకచిత్రం
ప్రతీకాత్మక చిత్రం


తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్‌ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ సొంత రాష్ట్రం బీహార్‌లో ఓ పదో తరగతి విధ్యార్థితో పాటు మరో కుర్రాడు కూడా హీరో మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి మీరు ఇలా ప్రాణాలు తీసుకోవద్దని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా కూడా అభిమానులకు విజ్ఞప్తి చేస్తుంది.
First published: June 19, 2020, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading