OMG అలియా భట్ స్విమ్మింగ్ పూల్‌లో పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Snake in Alia Bhatt Swimming Pool: లాక్‌డౌన్ సమయంలో మూగ జీవాలు రోడ్ల మీదకు వచ్చాయని విన్నాం.. కానీ ఇప్పుడు పాములు కూడా వచ్చేస్తున్నాయి. లాక్‌డౌన్ అయిపోయిన సంగతి ఇంకా వాటికి తెలియలేదేమో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2020, 9:05 PM IST
OMG అలియా భట్ స్విమ్మింగ్ పూల్‌లో పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అలియా భట్ స్విమ్మింగ్ పూల్‌లో పాము (snake in alia bhatt swimming pool)
  • Share this:
లాక్‌డౌన్ సమయంలో మూగ జీవాలు రోడ్ల మీదకు వచ్చాయని విన్నాం.. కానీ ఇప్పుడు పాములు కూడా వచ్చేస్తున్నాయి. లాక్‌డౌన్ అయిపోయిన సంగతి ఇంకా వాటికి తెలియలేదేమో కానీ ఏకంగా ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి కూడా వచ్చి ఈత కొట్టి వెళ్లిపోతున్నాయి. తాజాగా ఇదే విచిత్రం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో జరిగింది. ఈ విషయాన్ని ఆమె తల్లి సోనీ రాజ్‌ధాన్ తెలిపింది. తమ ఇంటికి ఈ రోజు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడని వీడియో తీసింది సోనీ. స్విమ్మింగ్ పూల్‌లో ఓ పాము అటూ ఇటూ తేలుతూ కనిపించింది.


చూడ్డానికి కూడా భయకరంగా ఉన్న ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలియా భట్ తల్లి. చూడండి.. ఈ రోజు మా స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన ప్రత్యేక అతిథిని అంటూ వీడియో పెట్టింది ఈమె. ఆ తర్వాత రెండో వీడియోలో పాము వచ్చింది.. నీళ్లు తాగి.. కాసేపు ఈత కొట్టి వెళ్లిపోయింది అంటూ పోస్ట్ చేసింది.

ఈ వీడియో చేసి బాలీవుడ్ ప్రముఖులు కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.. అది మీ ఇంటి ఆవరణలోకి వెళ్లింది అంటూ చాలా మంది కామెంట్ చేసారు. ఇక అలియా తల్లి పాము గురించి చెప్తూ తాను 9 సంవత్సరాల తర్వాత పామును నేరుగా చూస్తున్నానని కామెంట్ చేసింది. మొత్తానికి అలియా భట్ స్విమ్మింగ్ పూల్‌లో పాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిపోతుంది.
First published: July 1, 2020, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading