హీరో నాగార్జున పొలంలో మృతదేహం.. కుళ్లిపోయిన స్టేజ్‌లో డెడ్ బాడీ..

హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది.షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం దొరికింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 11:20 PM IST
హీరో నాగార్జున పొలంలో మృతదేహం.. కుళ్లిపోయిన స్టేజ్‌లో డెడ్ బాడీ..
అక్కినేని నాగార్జున దంపతులు
  • Share this:
హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది.షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం దొరికింది. అది కూడా పూర్తిగా కుళ్ళిపోయి.. ఎముకల గూడులా ఉండటం సంచలనాలకు తావిస్తుంది. పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసాడు నాగార్జున. సెప్టెంబర్ 10న తన వ్యవసాయ కేత్రంలో భార్య అమలతో కలిసి చెట్లు కూడా నాటాడు నాగార్జున. వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇదే విషయంపై వ్యవసాయ సాగు కోసం తన పొలానికి నిపుణులను పంపాడు నాగార్జున.. ఆయన కుటుంబ సభ్యులు.
A dead body found in Nagarjun Akkineni agriculture land pk హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం కలకలం రేపుతుంది.షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహాం దొరికింది. nagarjuna,nagarjuna akkineni,nagarjuna akkineni twitter,nagarjuna akkineni instagram,nagarjuna akkineni dead body,nagarjuna akkineni dead body agriculture land,telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,నాగార్జున పొలం,నాగార్జున పొలంలో శవం,
నాగార్జున పొలంలో శవం (Source: Twitter)

అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని నిపుణులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్దానికులు.. నిపుణులు. కుళ్లిపోయిన మృతదేహానికి అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ శవం దొరికిన గదిని సీజ్ చేసి సెప్టెంబర్ 19న అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా ఆరా తీయనున్నారు పోలీసులు. మరి ఈ విషయంపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు