హోమ్ /వార్తలు /సినిమా /

హీరో నితిన్‌కు పెద్ద దెబ్బ.. డిజిటల్, శాటిలైట్‌‌లలో అవి కుదరవంటూ..

హీరో నితిన్‌కు పెద్ద దెబ్బ.. డిజిటల్, శాటిలైట్‌‌లలో అవి కుదరవంటూ..

నితిన్ (Nithiin)

నితిన్ (Nithiin)

హీరో నితిన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అతని భీష్మ సినిమా పై తెలంగాణ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఫైల్ అయింది. వివరాల్లోకి వెళితే..

హీరో నితిన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అతని భీష్మ సినిమా పై తెలంగాణ హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఫైల్ అయింది. వివరాల్లోకి వెళితే.. హీరో నితిన్,రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా ‘భీష్మ’. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. అంతేకాదు  ఈ సినిమాను కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలను గడించారు. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు గంగపుత్రులను కించపరిచేలా ఉన్నాయని  హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌లో ఆ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ ఫిర్యాదు చేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా  అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అలాంటి సన్నివేశాలను ‘భీష్మ’ సినిమాన నుంచి వెంటనే తొలిగించాలని రాజేశ్వర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు త్వరలో ప్రసారమయ్యే శాటిలైట్, డిజిటల్‌లలో కూడా ఆ సన్నివేశాలు తొలిగించి ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు వారాలు పూర్తి కావొస్తోంది. ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మావన హక్కుల సంఘంలో కేసు నమోదు కావడం గమనార్హం. మరి ఈ కంప్లైంట్‌తో భీష్మ చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

First published:

Tags: Bheeshma, Nithiin, Rashmika mandanna, Telugu Cinema, Tollywood, Venky Kudumula

ఉత్తమ కథలు