వర్మపై కేసు.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రణయ్ తండ్రి పిటిషన్..

ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది.

news18-telugu
Updated: July 5, 2020, 7:56 AM IST
వర్మపై కేసు.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రణయ్ తండ్రి పిటిషన్..
రామ్ గోపాల్ వర్మ Photo : Twitter
  • Share this:
ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. ఆయన ఇటీవల మర్డర్ అనే సినిమా పేరుతో అమృత, మారుతీరావు, ప్రణయ్ నిజ జీవిత కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు దీనికి సంబందించిన కొన్ని పోస్టర్స్‌ను కూడా ఆయన ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. దీంతో ఈ సినిమాపై అమృత అసహానం వ్యక్తం చేసింది. అంతేకాదు అమృత మామ, ప్రణయ్ తండ్రి బాలస్వామి తాజాగా ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో ఆయన పేర్కోంటూ.. ఈ మర్డర్ సినిమా తన కుమారుడి హత్య కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలపడంతో... బాల స్వామి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మర్డర్ సినిమాను రామ్ గోపాల్ సమర్పిస్తుండగా.. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నాడు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు వర్మ ప్రస్తుతం కరోనా వైరస్ అని, పవర్ స్టార్ అంటూ పలు సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ సినిమా ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కనుందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్.. మరి ఈ సినిమా ఎన్ని వివాదాలను తెస్తుందో చూడాలి..
Published by: Suresh Rachamalla
First published: July 5, 2020, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading