Nutan Naidu: శిరో ముండనం చేయించారని బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయడుపై కేసు నమోదు..

Bigg Boss Fame Nutan Naidu Case Filed | బిగ్‌బాస్ ఫేమ్ నిర్మాత నూతన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: August 29, 2020, 8:20 AM IST
Nutan Naidu: శిరో ముండనం చేయించారని బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయడుపై కేసు నమోదు..
బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడుపై కేసు నమోదు (File/Photos)
  • Share this:
Bigg Boss Fame Nutan Naidu Case Filed | బిగ్‌బాస్ ఫేమ్ నిర్మాత నూతన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..  విశాఖ పట్నం పెందుర్తి మండలం సుజాత నగర్‌లో ఎస్సీ యువకుడు శ్రీకాంత్‌కు శిరో ముండనం చేయించిన ఘటనలో  నూతన్ నాయుడు పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు. బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసిన నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో కొన్నాళ్లుగా పనిచేసాడు శ్రీకాంత్. ఈ మధ్యనే నూతన్ నాయుడు తన ఇంట్లో ఓ సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో శ్రీకాంత్‌ను ఇంటికి పిలిపించారు. ఇంట్లో పనిచేసి మానేసిన శ్రీకాంత్.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ దొంగతనం చేసాడని ఆరోపిస్తూ నూతన్ నాయుడు.. శ్రీకాంత్‌ను తన ఇంట్లోనే శిరో ముండనం చేయించినట్టు.. బాధితుడు శ్రీకాంత్.. విశాఖ పట్నం పోలీసులకు కంప్లైంట్ చేసారు.

అంతేకాదు ఈ  విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు శ్రీకాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఈ నేపథ్యంలో నూతన్ నాయుడుపై ఎస్సీ యువకుడికి శిరో ముండనం చేయించిన కేసులో అతనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం నూతన్ నాయుడు ఆర్జీవిపై ‘పరాన్నజీవి’ అనే సినిమాను డైరెక్ట్ చేసాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 29, 2020, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading