ప్రభాస్ హీరోగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన భారీ సినిమా సాహో తెలిసిందే. అది అలా ఉంటే సాహో సినిమా ప్రొడ్యూసర్స్ పై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన ఔట్ షైనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబందించిన బ్యాగుల్నీ తమ సినిమాలో ప్రమోట్ చేస్తామని చెప్పి.. సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ ఓ అగ్రిమెంట్ చేసుకుని ఆ తర్వాత దానిని పట్టించుకోలేదని ఓ కేసు నమోదు చేశారు ఆ సంస్థ ప్రతినిధులు.
తమ సంస్థ తయారు చేసిన బ్యాగులను సాహో సినిమాలో హీరో, హీరోయిన్స్ వాడుతున్నట్టు చూపిస్తామని., ఆ బ్యాగులకు తగిన ప్రచారం కల్పిస్తామని గత ఏడాది జులై 8న సాహో నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నమన్నారు. అందులో భాగంగా... ఆ ఒప్పందం ప్రకారం రూ.1.38 కోట్లకుపైగా డబ్బు తీసుకున్న చిత్ర నిర్మాతలు... సాహో సినిమాలో మా ప్రొడక్ట్స్‌ను చూపించకుండా మమ్మల్నీ మోసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాగుల తయారీ ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ విజయరావు గురువారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగుల సంస్థ నుండి అందుకున్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టనున్నామని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వెంకట్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sahoo, Telugu Movie News