HOME » NEWS » movies » A CASE FILED IN JUBILEE HILLS POLICE STATION ON ALA VAIKUNTHAPURRAMULOO EVENT MANAGING COMPANY SR

అల్లు అర్జున్ ‘అల...వైకుంఠపురములో’ టీమ్‌పై కేసు నమోదు..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల...వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది.

news18-telugu
Updated: January 9, 2020, 12:25 PM IST
అల్లు అర్జున్ ‘అల...వైకుంఠపురములో’ టీమ్‌పై కేసు నమోదు..
Twitter
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల...వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ ప్రచారంలో భాగంగా ఈ సినిమా మ్యూజికల్ నైట్ వేడుక ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకను నిర్వహించిన శ్రేయాస్ సంస్థ నిర్వాహకులపై కేసులు నమోదు అయ్యాయి. సినిమా మ్యూజికల్ నైట్ వేడుక సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రేయాస్ మీడియా ఎండీ శ్రీనివాస్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మేనేజర్ గణేష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 6న జరిగిన వేడుకకు ముందుగా అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ మందికి పాసులు ఇవ్వడంతో పాటు, ఆ కార్యక్రమం రాత్రి 11:30 గంటలకు వరకు కొనసాగడంతో ఈ మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు.
అదిరిన పూజా హెగ్డే అందాలు..
Published by: Suresh Rachamalla
First published: January 9, 2020, 12:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading