హోమ్ /వార్తలు /సినిమా /

Major : మేజర్ నుంచి మధురమైన ఓ ఇషా పాట విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Major : మేజర్ నుంచి మధురమైన ఓ ఇషా పాట విడుదల.. అదిరిన రెస్పాన్స్..

Oh Isha from Adivi Sesh, Saiee M Manjrekar Major released Photo : Twitter

Oh Isha from Adivi Sesh, Saiee M Manjrekar Major released Photo : Twitter

Major : ఈ  చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ (Major Trailer) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. మంచి ఏమోషన్స్‌తో కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది.

ఇంకా చదవండి ...

Adivi Sesh | Major Trailer :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఓమిక్రాన్ కారణంగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గడంతో ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య’సినిమాలు తమ సినిమాల కొత్త విడుదల తేదిలు ప్రకటించాయి. ఈ కోవలోనే అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 27న విడుదల కానున్నట్టు ప్రకటించారు. కాగా మరోసారి మరోసారి వాయిదా పడింది. ఇక చివరిసారిగా ఈ  చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ (Major Trailer) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. మంచి ఏమోషన్స్‌తో కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ఓ ఇషా అంటూ సాగే ఈ పాట చాలా బాగుందని అంటున్నారు నెటిజన్స్. శేష్, సాయీ మంజ్రేకర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగుందని.. విజువల్స్ ఎంతో నాచురల్‌గా ఉన్నాయని అంటున్నారు. శ్రీచరణ్ పాకల స్వరపరిచిన ఈ పాటను రాజీవ్ భరద్వాజ్ రాయగా.. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద పాడారు.

ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

First published:

Tags: Adivi Sesh, Major film, Tollywood news

ఉత్తమ కథలు