హోమ్ /వార్తలు /సినిమా /

Adivi Sesh: అడవి శేష్ చేతుల మీదుగా 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' టీజర్ లాంచ్

Adivi Sesh: అడవి శేష్ చేతుల మీదుగా 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' టీజర్ లాంచ్

A Beautiful Girl News 18

A Beautiful Girl News 18

A Beautiful Girl Teaser Launch: అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది 'ఎ బ్యూటిఫుల్ గర్ల్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని హీరో అడవి శేష్ లాంచ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ నటీనటులుగా.. రవి ప్రకాష్ బోడపాటి రచన- దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' (A Beautiful Girl). ఈ సినిమాను ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిల్, క్రాంతి జువ్వల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 21 న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన సందర్బంగా హీరో అడవి శేష్ ట్విట్టర్ ద్వారా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

గిడియన్ కట్టా కొట్టిన తాజాగా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదలైన ఈ టీజర్ ను గమనిస్తే.. ఇప్పటివరకు నేను ఎన్నో, మిస్సింగ్ కేసెస్,రేప్ కేసెస్ & మర్డర్ కేసెస్ లను చూశాను కానీ ఇది చాలా టిఫికల్ కేస్ అని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న నటుడు మధునందన్ చెప్పే డైలాగ్ తో ఇదొక మర్డర్ మిస్ట్రీ కథ అనిపిస్తుంది. గతంలో చాలా మర్డర్ మిస్ట్రీ కథలు వచ్చినప్పటికీ.. ఇందులో కేవలం క్రైమ్‌ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్‌, డ్రామా, సెంటిమెంట్‌, క్రైమ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన కథను దర్శకుడు ఎంచుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎంతో స్మార్ట్ గా కనిపించిన కొత్త అబ్బాయ్ సమర్థ హీరో నా విల్లన్ ఆ అర్థం కావట్లేదు టీజర్ చూస్తుంటే, ఎంతో ఇన్నోసెంట్ గా కనిపించే హీరో నిహాల్ కోదాటిని అరెస్ట్ చేయడం, మరియు నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్ ల రొమాంటిక్ సీన్స్ మరియు న్యూస్ పేపర్ లో 'మోస్ట్ టెర్రీఫయింగ్ కేస్' అనే హెడ్ లైన్ చూస్తుంటే ఈ కథపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు రవి ప్రకాష్ బోడపాటి ప్రతిభ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అద్భుతమైన విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు అర్వీజ్ సాంగ్స్ అందించారు, నిహాల్ కోదాటి, ద్రిషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్, సమర్ద్, దేవి నాగవల్లి, మెహర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అమర్ దీప్,ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశాబావాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక, నిర్మాతలు.

Published by:Sunil Boddula
First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు