నటుడు ఆత్మహత్య.. విషాదంలో ఇండస్ట్రీ.. ఏడాదిలో 6వ యాక్టర్..

ప్రతీకాత్మక చిత్రం

ఇండస్ట్రీ ఎక్కడైనా పర్లేదు కానీ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిండా 30 ఏళ్లు కూడా లేని ఓ కుర్ర నటుడు అనుమానాస్పద స్థితిలో కన్నముూసాడు.

  • Share this:
ఇండస్ట్రీ ఎక్కడైనా పర్లేదు కానీ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిండా 30 ఏళ్లు కూడా లేని ఓ కుర్ర నటుడు అనుమానాస్పద స్థితిలో కన్నముూసాడు. దాంతో పోలీసులు కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఇది జరిగింది మన ఇండియాలో కాదు.. ఈ మద్య సౌత్ కొరియాలో కొంతకాలంగా వరసగా కొందరు ఆర్టిస్టులు చనిపోతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యంతో చనిపోతున్నారు. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా సౌత్ కొరియాలో మరో నటుడు కూడా అనుమానాస్పద రీతిలో కన్నుమూసాడు.
A 27 year actor mysterious death creating lot of sensation in South Korea and industry in deep trouble pk ఇండస్ట్రీ ఎక్కడైనా పర్లేదు కానీ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిండా 30 ఏళ్లు కూడా లేని ఓ కుర్ర నటుడు అనుమానాస్పద స్థితిలో కన్నముూసాడు. actor suicide,south korea,suicide in industry,cha in ha,cha in ha death,cha in ha passes away,cha in ha dead,cha in ha found dead,cha in ha drama,cha in ha fantagio,cha in ha passed away,cha in ha die,cha in ha died,korean actor suicide,korean actor cha in ha,hollywood,ఛా ఇన్ హా,యాక్టర్ ఆత్మహత్య,నటుడు ఆత్మహత్య,సౌత్ కొరియా
కొరియన్ నటుడు ఆత్మహత్య

27 ఏళ్ల ఛా ఇన్ హా అనే యాక్టర్ చనిపోయాడు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదంటే హత్యా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. కొరియాలో 'ది బ్యాంకర్', 'లవ్ విత్ ఫ్లాస్' లాంటి డ్రామా షోలలో నటించాడు ఛా ఇన్ హా. ఆయన మరణం ఇప్పుడు కొరియన్ సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఎందుకంటే గత ఏడాది కాలంలో అరడజన్ మంది ఇలా మృత్యువాత పడ్డారు. గతంలో కొరియన్ పాప్ స్టార్ సులీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడి ఆర్టిస్టుల మానసిక పరిస్థితి కారణంగా వరసగా మృత్యువు ఒడిలో చేరుకుంటుండటం అక్కడి ఇండస్ట్రీని విషాదంలో ముంచేస్తుంది.
A 27 year actor mysterious death creating lot of sensation in South Korea and industry in deep trouble pk ఇండస్ట్రీ ఎక్కడైనా పర్లేదు కానీ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. నిండా 30 ఏళ్లు కూడా లేని ఓ కుర్ర నటుడు అనుమానాస్పద స్థితిలో కన్నముూసాడు. actor suicide,south korea,suicide in industry,cha in ha,cha in ha death,cha in ha passes away,cha in ha dead,cha in ha found dead,cha in ha drama,cha in ha fantagio,cha in ha passed away,cha in ha die,cha in ha died,korean actor suicide,korean actor cha in ha,hollywood,ఛా ఇన్ హా,యాక్టర్ ఆత్మహత్య,నటుడు ఆత్మహత్య,సౌత్ కొరియా
కొరియన్ నటుడు ఆత్మహత్య

తన గానంతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న కొరియన్ పాప్ స్టార్ సులీ మరణం మరవకముందే.. ఆరు నెలల తర్వాత మరో నటుడు గో హరా మృతదేహం ఒక అపార్ట్మెంట్‌లో దొరికింది. దాంతో ప్రపంచం దృష్టి కొరియన్ ఇండస్ట్రీపై పడింది. నటన విషయంలో వాళ్లకు ఎదురువుతున్న ఇబ్బందులు.. ఒత్తిడి కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు ఛా ఇన్ హా కన్నముూత కూడా ఇదే కోవలోకి వచ్చింది. దక్షిణ కొరియా పోలీసులు కూడా ఈయనది ఆత్మహత్యా కాదా అని తేల్చే పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా అభిమాన నటుల వరస మరణాలు అక్కడి అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: