హోమ్ /వార్తలు /సినిమా /

90ML Teaser : లిక్కర్‌తో నడిచే బండి గుద్దితే అడ్రస్‌ ఉండదు..

90ML Teaser : లిక్కర్‌తో నడిచే బండి గుద్దితే అడ్రస్‌ ఉండదు..

Twitter/baraju_SuperHit

Twitter/baraju_SuperHit

90ML Teaser : 'RX100' సినిమాతో క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ సినిమాలో ఇటు రొమాంటిక్ సీన్స్‌లో అటు యాక్షన్ సీన్స్‌లలో కూడా ఇరగదీశాడు.

  90ML Teaser : 'RX100' సినిమాతో క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ సినిమాలో ఇటు రొమాంటిక్ సీన్స్‌లో గాని లేదా అటు యాక్షన్ సీన్స్‌లలో కూడా ఇరగదీశాడు. ఆయన ప్రస్తుతం  ‘90ML’ అనే సినిమాలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 21న కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్‌లో కార్తికేయ ఇటు యాక్షన్ సీన్స్‌లో అటూ తాగుబోతుగా అదరగొట్టాడు. టీజర్‌లో నటుడు అజయ్‌తో కార్తికేయ ‘అరెయ్‌ డీజిల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. ఇది లిక్కర్‌తో నడిచే బండి. గుద్దితే అడ్రస్‌ ఉండదు.’ అంటూ సాగిన డైలాగ్‌ మాస్‌ను విపరీతంగా అలరించనుంది. మరో సీన్‌లో అలీ కార్తికేయతో ‘డైలీ ఎంత వేస్తావ్‌..’ అని అడగ్గా ‘పూటకు 90ML సార్‌..’ అని కార్తికేయ చెబుతుండగా.. అలీ  ‘ఏ క్వార్టర్‌ ఇస్తే తాగవా?’ అని ప్రశ్నించగా.. ‘డాక్టర్‌ 90 ml మాత్రమే తాగమన్నారు.’ అంటూ చెప్పిన డైలాగులు అదరగొడుతున్నాయి.

  శేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా.. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్  అందిస్తున్నారు. హీరోయిన్‌గా  నేహా సోలంకి చేస్తోంది. మిగితా ముఖ్య పాత్రల్లో రావు రమేష్‌, పోసాని, అజయ్‌ నటిస్తున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Kartikeya, Telugu Movie News

  ఉత్తమ కథలు