‘83’ Biopic OTT Streaming : దాదాపు 39 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ సారథ్యంలో భారత దేశానికి క్రికెట్లో అందించిన మధురమైన విజయం 1983 వరల్డ్ కప్. దాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన సినిమా ‘83’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న గతేడాది డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుకున్నట్టే విదేశాల్లో ఈ మూవీ మంచి వసూళ్లనే సాధించింది. కానీ మన దేశంలో మాత్రం అనుకున్నంత రేంజ్లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయ లేదు. రూ. 270 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం మన దేశంలో ఓమిక్రాన్ భయం నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ విధించడం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. ఇక ఈ సినిమాను చూసిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు చూసి ‘83’ మూవీ అద్భుతం అంటూ కితాబు ఇచ్చినా.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ సినిమాకు మొత్తం థియేట్రికల్ రన్లో కనీసం రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లు వరకు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా అల్లు అర్జున్ ’పుష్ప’ వంటి మాస్ సినిమా హిందీలో విడుదల కావడం.. అక్కడి మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చడంతో ‘83’ వంటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీని పట్టించుకోలేదు. తాజాగా ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్ స్టార్‌లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
#83 is now streaming in @DisneyPlusHS in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam #83onHotstarhttps://t.co/eheZVgF9NG@kabirkhankk @RanveerOfficial @deepikapadukone @TripathiiPankaj @HARRDYSANDHU @AmmyVirk #DhairyaKarwa @RelianceEnt @83thefilm @FuhSePhantom @AnnapurnaStdios pic.twitter.com/25Cxik47Ys
— BA Raju's Team (@baraju_SuperHit) March 21, 2022
‘83’ మూవీ విషయానికొస్తే.. భారత దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట కాదు.. ఎమోషన్.. ఇంకా చెప్పాలంటే ఓ మతం. 130 కోట్ల మందిలో దాదాపు 70 శాతం మంది క్రికెట్ చూస్తారంటూ సర్వేలు కూడా చెప్తున్నాయి. అంటే మన దేశంలో క్రికెట్ అనేది ఎంత పెద్ద క్రీడో అర్థమవుతుంది. అందుకే క్రికెట్ అన్నా.. ఆ నేపథ్యంలో వచ్చే సినిమాలన్నా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు. భారత దిగ్గజ క్రికెటర్స్‌లో ఒకరైన మాజీ సారథి కపిల్ దేవ్ (Kapil Dev) 83 వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్.. కపిల్ దేవ్ పాత్రలో నటిస్తే.. ఆయన భార్య రోమి భాటియాగా దీపికా పదుకొణే యాక్ట్ చేసింది.
బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. ఇప్పటికే టీమిండియా మాజీ సారథులు ఎంఎస్ ధోని, సచిన్, అజారుద్దీన్ జీవిత చరిత్రలపై బయోపిక్స్ వచ్చాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కపిల్ దేవ్ క్రికెటర్‌గా ఆయన పయనం... ప్రపంచ కప్ గెలవడంపై 83 సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా.. అతి తక్కువ వసూళ్లే దక్కాయి.ఈ సినిమాను విబ్రీ మీడియా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ఈ చిత్రాన్ని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో విడుదల చేశారు. మొత్తంగా బాక్సాఫీస్ మైదానంలో కలెక్షన్ల పరుగును తీయలేకపోయినా ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 83 Biopic, Bollywood news, Disney+ Hotstar, Netflix, Ranveer Singh, Tollywood