హోమ్ /వార్తలు /సినిమా /

68th National Film Awards : 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. సూర్య, థమన్‌లకు జాతీయ అవార్డులు..

68th National Film Awards : 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. సూర్య, థమన్‌లకు జాతీయ అవార్డులు..

జాతీయ అవార్డులు గెలుచుకున్న సూర్య, తమన్ (file/Photo)

జాతీయ అవార్డులు గెలుచుకున్న సూర్య, తమన్ (file/Photo)

68th National Awards : 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ‘సూరాయైపొట్రు’ ఎంపికైయింది. ఉత్తమ నటుడిగా సూర్య నిలిస్తే.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ జాతీయ అవార్డు అందుకోనున్నారు.

  68th National Awards : భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్త నటీనటులను ప్రతి యేడాది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా కేంద్ర ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సూర్య హీరోగా నటించిన ‘సూరయై పొట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా’  సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరయైపొట్రు’  ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కైవసం చేసుకున్నారు. మరోవైపు తానాజీలోని నటనకు గాను అజయ్ దేవ్‌గణ్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక ఆకాశమే నీ హద్దురా  సినిమాలో హీరోయిన్‌గా నటించిన అపర్ణ బాలమురళి ఉత్తమ నటిగా ఎంపికైయింది. ఇక అల వైకుంఠపురములో’ మ్యూజిక్‌గాను తమన్ జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. తెలుగులో కలర్ ఫోటో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. మరోవైపు ‘నాట్యం’ సినిమాలకు బెస్ట్ మేకప్, బెస్ట్ కొరియోగ్రఫీ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా ’అయ్యప్పనుమ్ కోషియమ్’లోని నటకు గాను బీజూ మీనన్‌కు అవార్డు వరించింది.

  2020 యేడాదిగాను 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో 148 చిత్రాలు 20 భాషల్లో స్క్రీనింగ్‌కు ఎంపికయ్యాయి. ఈ ఇయర్ జాతీయ చలన చిత్ర అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 28 కేటగిరీలు .. 22 కేటగిరీలో నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించారు. మొత్తంగా ఉత్తమ కథా రచయత, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: National film awards, Suriya, Thaman

  ఉత్తమ కథలు