సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ తమ టాలెంట్ చూపిస్తూ ఓ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా ఫీల్ అవుతుంటారు నటీనటులు, టెక్నీషియన్స్. తమ టాలెంట్ గుర్తించి అవార్డు ప్రకటించడం పట్ల తెగ సంబరపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది బాగా పర్ఫామ్ చేసిన, తమ టాలెంట్ తో ప్రేక్షక లోకాన్ని అలరించిన నటీనటులు, ఇతర సినిమా సిబ్బందికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు (2022) (67th South Film fare Awards) వేడుక (అక్టోబర్ 9) ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పలువురు సౌత్ ఇండియన్ తారలు తళుక్కున మెరిశారు. అందాల తారలు రెడ్ కార్పెట్ పై అలా నడుస్తుంటూ వస్తూనే లక్షల్లో కెమెరా క్లిక్స్ పడ్డాయి. తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమల్లోని పలువురు తారలు, టెక్నీషియన్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.
2020, 2021 మధ్య దక్షిణాది పరిశ్రమ నుండి ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రధానం చేశారు. గత రెండేళ్లలో, దక్షిణాది నుండి వచ్చిన ఉత్తమ కంటెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ పలువురు తారలకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందించారు. మరి ఈ అవార్డు ఎవరెవరిని వరించింది. ఆ లిస్ట్ ఓ సారి చూద్దామా..
#PushpaTheRise rules at @filmfare Awards South ❤️ pic.twitter.com/wB3dI1indi
— Mythri Movie Makers (@MythriOfficial) October 9, 2022
The smile of a winner!#SaiPallavi clicked backstage after her big win(s) at the 67th #ParleFilmfareAwardsSouth 2022 with Kamar Film Factory. pic.twitter.com/qpG4tQgUi8
— Filmfare (@filmfare) October 9, 2022
తెలుగు విన్నర్స్
ఉత్తమ నటుడు (మేల్ లీడింగ్ రోల్): అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి ఫిమేల్ లీడింగ్ రోల్ : సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ చిత్రం: పుష్ప ది రైజ్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప)
ఉత్తమ నటుడు (మేల్ సపోర్టింగ్ రోల్): మురళి శర్మ (అల.. వైకుంఠపురములో)
ఉత్తమ నటి (ఫిమేల్ సపోర్టింగ్ రోల్): టబు (అల.. వైకుంఠపురములో)
బెస్ట్ లిరిక్స్: సీతారామ శాస్ట్రీ - లైఫ్ ఆఫ్ రామ్ (జాను)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్): సిద్ శ్రీరామ్ - శ్రీవల్లి (పుష్ప)
బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్): ఇంద్రవతి చౌహన్ - ఊ అంటావా (పుష్ప)
బెస్ట్ కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ - రాములో రాములా (అల.. వైకుంఠపురములో)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: మీరోస్లా కూబా బ్రజక్ (పుష్ప)
బెస్ట్ డెబ్యూ మేల్: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
బెస్ట్ డెబ్యూ ఫిమేల్: కృతి శెట్టి (ఉప్పెన)
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అల్లు అరవింద్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Allu Arjun, Tollywood