Home /News /movies /

67TH NATIONAL FILM AWARDS MAHARSHI MOVIE DIRECTOR VAMSHI PAIDIPALLY SHARES SCREEN SHOT OF MAHESH BABU MESSAGES MNJ

67th National Film Awards: అప్పుడు మీర‌న్న మాట‌లే నిజ‌మ‌య్యాయి.. మ‌హేష్‌తో చాట్ రివీల్ చేసిన వంశీ పైడిపల్లి

మహేష్ బాబు వంశీ పైడిపల్లి

మహేష్ బాబు వంశీ పైడిపల్లి

Mahesh Babu- vamshi Paidipally: 67వ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈసారి తెలుగు చిత్రాలు కూడా మంచి స‌త్తాను చాటాయి. జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాలు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. జెర్సీకి ఉత్త‌మ తెలుగు చిత్రం, బెస్ట్ ఎడిట‌ర్ (న‌వీన్ నూలి) విభాగాల్లో జాతీయ అవార్డులు ల‌భించాయి.

ఇంకా చదవండి ...
    Mahesh Babu- vamshi Paidipally: 67వ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈసారి తెలుగు చిత్రాలు కూడా మంచి స‌త్తాను చాటాయి. జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాలు జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. జెర్సీకి ఉత్త‌మ తెలుగు చిత్రం, బెస్ట్ ఎడిట‌ర్ (న‌వీన్ నూలి) విభాగాల్లో జాతీయ అవార్డులు ల‌భించాయి. అలాగే మ‌హ‌ర్షికి ఉత్తమ వినోదాత్మ‌క చిత్రం, ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ విభాగాల్లో అవార్డులు ల‌భించాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు టీమ్‌ల‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు ఈ రెండు సినిమా టీమ్‌లు కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హ‌ర్షి ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మ‌హ‌ర్షి టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెబుతూ.. ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు లేక‌పోతే ఇంత‌టి విజ‌యం వ‌చ్చేది కాద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. అంతేకాదు మ‌హేష్‌తో చాట్‌ను కూడా రివీల్ చేశారు. ఆ చాట్ ఊపిరి సినిమాకు గానూ వంశీ పైడిప‌ల్లికి ఫిలింఫేర్ వ‌చ్చిన స‌మ‌యంలో మ‌హేష్ బాబు చేశారు.

    అందులో కంగ్రాట్స్ వంశీ. నీకు వ‌చ్చిన అవార్డు గురించి ఇప్పుడే విన్నాను. నెక్ట్స్ మూవీకి క‌చ్చితంగా నేష‌న‌ల్ అవార్డు రావాలి అని మ‌హేష్ మెసేజ్ చేయ‌గా.. థ్యాంక్యు స‌ర్. మ‌నం క‌చ్చితంగా దీన్ని సాధిద్దాం అని వంశీ రిప్లై ఇచ్చారు. ఆ త‌రువాత మ‌హేష్ బాబు.. మ‌న చిత్రం కోసం ఏం కావాల‌న్నా చెప్పు నేను ఉంటాను. ఈ చిత్రాన్ని మనం క‌చ్చితంగా నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాలి అని మ‌హేష్ బాబు మెసేజ్ పెట్టారు.







    దీన్ని షేర్ చేసిన వంశీపైడిప‌ల్లి.. మ‌హ‌ర్షిపై మీ న‌మ్మ‌కం ఇవాళ ఈ రోజును ఇచ్చింది. 2017లో నా చిత్రం ఊపిరికి ఫిలిం ఫేర్ వ‌చ్చిన స‌మ‌యంలో మీరు నాకు పెట్టిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌ను షేర్ చేసుకుంటున్నా. మీ మాట‌లే నిజ‌మ‌య్యాయి. థ్యాంక్యు స‌ర్ అని కామెంట్ పెట్టారు. కాగా స‌రిలేరు నీకెవ్వ‌రు త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న‌ట్లు మ‌హేష్ బాబు అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట‌లో న‌టిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Maharshi, Mahesh babu, Vamshi paidipally

    తదుపరి వార్తలు