Naveen Polishetty- Sushant Singh Rajput: 2019 ఏడాదిగానూ 67వ జాతీయ పురస్కారాల విజేతలను సోమవారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రంగా మోహన్ లాల్ మరక్కర్ నిలవగా.. ఉత్తమ నటులుగా ధనుష్(అసురన్), మనోజ్ భాజ్‌పేయ్(భోంస్లే) నిలిచారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్(క్వీన్) ఎంపిక అయ్యారు. ఇక ఈసారి తెలుగు చిత్రాలు కూడా సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా నాని జెర్సీ, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేష్ బాబు మహర్షి, ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి(జెర్సీ), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం(మహర్షి), ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి) జాతీయ అవార్డులకు ఎంపిక అయ్యాయి. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిచ్చోరే నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో కీలక పాత్రలో నటించిన నవీన్ పొలిశెట్టి, సుశాంత్ గురించి ఓ భావోద్వేగ ట్వీట్‌ని పెట్టారు.
ఉత్తమ హిందీ చిత్రంగా చిచ్చోరే జాతీయ అవార్డును దక్కించుకుంది. జాతి రత్నాలు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు సుశాంత్. ఇది నీ కోసమే. మిస్ యు భాయ్. నితేష్ సర్, మాయ, డెరెక్, బేవ్‌డా, సెక్సా, మమ్మీ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. మీ యాసిడ్ అని నవీన్ కామెంట్ పెట్టారు. మరోవైపు సుశాంత్ అభిమానులు కూడా ఆయనను తలుచుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
#Chhichhore wins the National award for Best Hindi film. And #JathiRatnalu is a blockbuster. I know you are watching Sushant. This one is for you . Miss you bhai ❤️ congratulations to Nitesh sir , maya , Derek , bewda, mummy , Sexa and the whole team. Love , Acid ❤️ pic.twitter.com/ZWri1ebrGJ
— Naveen Polishetty (@NaveenPolishety) March 23, 2021
కాగా ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి ఆఫర్ రావడం వెనుక పెద్ద కథనే ఉంది. నితేష్ తెరకెక్కించిన చిచ్చోరేలో ఒక పాత్ర కోసం మొదట మలయాళ నటుడు నివిన్ పాలీని దర్శకుడు నితేష్ అనుకున్నారట. అఈ విషయాన్ని ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా(సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా దర్శకుడు)కు నితేష్ చెప్పారట. అయితే ఆ పేరును నవీన్ పాలీగా విన్న ముఖేష్ చాబ్రా నవీన్ పొలిశెట్టికి ఫోన్ చేసి రమ్మన్నారట. అప్పటికే ముఖేష్ చాబ్రా, నవీన్‌ని 50 సార్లకు పైగానే రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తరువాత నవీన్‌ని చూసిన నితేష్.. మేము అనుకున్నది నిన్ను కాదు నవీన్ పాలీని అని చెప్పి అతడికి సారీ చెప్పారట. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నవీన్ నటించిన ఒక వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారడం, దాన్ని నితేష్ చూసి సుశాంత్ నటించిన చిచ్చోరేలో నవీన్‌కి యాసిడ్ పాత్ర ఇవ్వడం జరిగిందట. అప్పుడు కూడా ఆడిషన్లో సెలక్ట్ అయిన తరువాతనే నవీన్ ని తీసుకున్నారట. దీన్నంతా నవీన్ ఒక షోలో చెప్పాడు. కాగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో హీరోగా తెలుగులోకి మంచి ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు జాతి రత్నాలుతో రెండో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇతడి కోసం ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 67th National Film Awards:, National film awards, Sushant Singh Rajput