హోమ్ /వార్తలు /సినిమా /

67Th FilmFare Awards South: ఫస్ట్ టైమ్ బెంగుళూరులో 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం..

67Th FilmFare Awards South: ఫస్ట్ టైమ్ బెంగుళూరులో 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం..

బెంగళూరులో 67వ  ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవం (Twitter/Photo)

బెంగళూరులో 67వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవం (Twitter/Photo)

67Th FilmFare Awards South: ప్ర‌తి ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన చిత్రాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను వ‌రించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొద‌టిసారి బెంగుళూరు వేధిక‌గా జ‌రుగ‌నున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

67Th FilmFare Awards South: ప్ర‌తి ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన చిత్రాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను వ‌రించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొద‌టిసారి బెంగుళూరు వేధిక‌గా జ‌రుగ‌నున్నాయి. కమ‌ర్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న 67వ ఫిలింఫేర్ సౌత్‌ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో 2020-2021 సంవ‌త్సరానికి గాను ఈ అవార్డులు ప్ర‌ధానం చేయ‌నున్నారు. నాలుగు ద‌క్షిణాది భాషల్లోని ఉత్త‌మ చిత్రాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ అవార్డులు ల‌భించ‌నున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో పూజా హెగ్దే, కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ తదిత‌రులు త‌మ అంద‌మైన డ్యాన్స్ పెర్‌ఫామెన్స్‌ల‌తో అల‌రించ‌నున్నారు. అక్టోబ‌రు 9న ఇంట‌ర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ బెంగుళూరులో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం, కన్నడలో గత 50 యేళ్లకు పైగా ప్రధానం చేస్తూ ఉన్నారు. ఇందులో ఇచ్చే అవార్డుల విషయంలో లాబీయింగ్ ఉన్న.. ఓవరాల్‌గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలన చిత్ర అవార్డుల తర్వాత ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ప్రజల్లో గుర్తింపు వుంది. ప్రముఖ చలన చిత్ర మ్యాగజైన్ ఫిల్మ్‌ఫేర్ ఈ అవార్డులు ఇస్తూ వస్తోంది.

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్  1954లో జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రారంభించిన తర్వాత ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. 1952-53లో విడుదలైన సినిమాలకు ఇవ్వడం ప్రారంభించారు. 1964లో ఈ అవార్డ్స్‌ను తెలుగు, తమిళం, బెంగాలీ, మారాఠీ భాషల్లో ఇవ్వడం ప్రారంభించారు. 1963లో విడుదలైన సినిమాల్లో ఉత్తమమైన వాటికి 1964లో ఈ అవార్డ్స్ ఇచ్చారు. 1967 మరియు 1970లలో మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలకు ఇవ్వడం ప్రారంభించారు.

Samantha - Pooja Hegde - Nidhhi: సమంత,పూజా హెగ్డే, నిధి అగర్వాల్ ఈ హీరోయిన్స్‌ మధ్య ఉన్న సంబంధం ఇదే..

1976 వరకు ఈ అవార్డులను హిందీ సినిమాలతో కలిపి మిగిలిన దక్షిణాది భాషలకు చెందిన సినిమాలకు ఈ అవార్డులను ముంబైలో ప్రధానం చేసేవారు. ఆ తర్వాత మిగిలిన దక్షిణాది భాషలకు సంబంధించిన అవార్డులను చెన్నైలో ఇవ్వడం ప్రాభించారు. దక్షిణాది నుంచి కమల్ హాసన్, ఉదయ్ కిరణ్ అతి తక్కువ వయసులో ఈ అవార్డు అందుకున్న దక్షిణాది హీరోలుగా రికార్డులకు ఎక్కారు.

బెంగళూరులో అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక (Twitter/Photo)

ఫిల్మ్‌ఫేర్  సౌత్ అవార్డులను 1972లో చెన్నైలో నిర్వహించారు. 1973 మరియు 74లో మళ్లీ ముంబైలో ఈ వేడుకను నిర్వహించారు. ఆ తర్వాత 1974 నుంచి రెగ్యులర్‌గా ఈ వేడుకను చెన్నైలో నిర్వహించేవారు. ఆ తర్వాత ఇపుడు బెంగళూరులో తొలిసారి నిర్వహిస్తున్నారు. తాజాగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను అక్టోబర్ 9న బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ తుముకూరు రోడ్డులో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు