జాతీయ ఉత్తమనటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటులుగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా

66వ నేషనల్ అవార్డుల ప్రకటన జరిగింది. జాతీయ ఉత్తమ నటుడుగా ధనుష్ ఎంపికయ్యాడు. వడా చెన్నై సినిమాకు గానూ ఈయన నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. వెట్రి మారన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయం సాధించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 9, 2019, 4:08 PM IST
జాతీయ ఉత్తమనటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటులుగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా
మహానటిగా కీర్తిసురేష్
  • Share this:
66వ నేషనల్ అవార్డుల ప్రకటన జరిగింది. జాతీయ ఉత్తమ నటులుగా ఇద్దరూ ఎంపికయ్యారు. ఉరి, అంధాదూన్ సినిమాలకు గానూ విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానాకు సినిమాకు గానూ ఈయన నేషనల్ అవార్డ్ సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ హిందీ చిత్రంగా ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే అంధాదున్ సినిమాకు వచ్చింది. ఇదే సినిమాలో నటనకు జాతీయ అవార్డు అందుకున్నాడు ఆయుష్మాన్. ఇక విక్కీ కౌశల్ కూడా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపిక కావడం అద్భుతం. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా మహానటి అవార్డ్ సాధించడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇక సౌండ్ మిక్సింగ్‌లో రంగస్థలం జాతీయ అవార్డ్ అందుకుంది. నాని నిర్మించిన అ.. సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు వచ్చింది. ఇదే విభాగంలో కేజియఫ్ సినిమాకు కూడా జాతీయ అవార్డ్ లభించింది. బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఉరి సినిమాకు వచ్చింది.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు