‘సాహో’కు 6 షోలు.. తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి..?

సాహో సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అయిపోయాయి. ఈ చిత్రం ఏపీ తెలంగాణల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 8:49 PM IST
‘సాహో’కు 6 షోలు.. తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి..?
సాహో పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
సాహో సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అయిపోయాయి. ఈ చిత్రం ఏపీ తెలంగాణల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. తొలిరోజు ఈ చిత్రం ఎంత వసూలు చేయబోతుందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో కూడా సాహోకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం అయిపోయింది. తెలుగులో బాహుబలి రికార్డులు ఈ చిత్రం బద్ధలు కొడుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమాకు ఆరు షోలు వేసుకోడానికి ఏపీ అనుమతి ఇవ్వడంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు.

6 Shows per day for Saaho movie in Andhra Pradesh and Huge Expectations on 1st day prediction pk సాహో సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అయిపోయాయి. ఈ చిత్రం ఏపీ తెలంగాణల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. saaho,saaho movie review,saaho movie release,saaho movie collections,saaho movie 1st day collections,saaho movie worldwide collections,saaho 1st day collections prediction,telugu cinema,prabhas saaho movie,సాహో,సాహో మూవీ,సాహో మూవీ కలెక్షన్,సాహో ఫస్ట్ డే కలెక్షన్,తెలుగు సినిమా
‘సాహో’ (twitter/Photo)

టికెట్ రేట్స్ పెంచుకోవడంలో కాస్త కోపం ప్రదర్శించినా కూడా షోలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు బడ్జెట్‌కు దోహదపడుతుంది. అర్ధరాత్రి 1 నుంచి రాత్రి 10 గంటల వరకు షోలు పడనున్నాయి. ఈ లెక్కన రెండు షోలు అంటే కచ్చితంగా డబ్బులు కూడా భారీగానే రావడం ఖాయం. కోట్లలో ఆదాయం పెరుగుతుంది. రెగ్యులర్ షోల కంటే కూడా ఎక్కువ డబ్బులే వస్తాయనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణలో ఈ అనుమతి లేదు. కేవలం ఆంధ్రాలో మాత్రమే ఈ పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం.

6 Shows per day for Saaho movie in Andhra Pradesh and Huge Expectations on 1st day prediction pk సాహో సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అయిపోయాయి. ఈ చిత్రం ఏపీ తెలంగాణల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. saaho,saaho movie review,saaho movie release,saaho movie collections,saaho movie 1st day collections,saaho movie worldwide collections,saaho 1st day collections prediction,telugu cinema,prabhas saaho movie,సాహో,సాహో మూవీ,సాహో మూవీ కలెక్షన్,సాహో ఫస్ట్ డే కలెక్షన్,తెలుగు సినిమా
‘సాహో’ ట్రైలర్ (ట్విట్టర్ ఫోటో)

ఏపీ తెలంగాణల్లో సాహో కచ్చితంగా 40 కోట్ల షేర్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. హిందీలో కూడా కచ్చితంగా కలెక్షన్లు 30 కోట్లకు పైగానే ఊహిస్తున్నారు. ఇక తమిళ, మళయాల, కన్నడ కలిపి మరో 20 కోట్ల వరకు వస్తాయంటున్నారు. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే కచ్చితంగా లెక్క మరో 10 కోట్లు పెరగనుంది. మొత్తానికి తొలిరోజే 100 కోట్ల వరకు సాహో వసూలు చేయడం ఖాయం అయిపోయింది. ఇక పాజిటివ్ టాక్ వస్తే సినిమా దూసుకుపోవడం పక్కా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 29, 2019, 8:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading