Home /News /movies /

Star Maa Parivaar Championship: ఆ షోలో శ్రీముఖికి అవమానం.. తొక్కే పర్సనాలిటీనా అంటూ యాంకర్ సుమా వైరల్ కామెంట్?

Star Maa Parivaar Championship: ఆ షోలో శ్రీముఖికి అవమానం.. తొక్కే పర్సనాలిటీనా అంటూ యాంకర్ సుమా వైరల్ కామెంట్?

star maa parivar championship

star maa parivar championship

Star Maa Parivaar Championship: బుల్లితెరలో ప్రసారమయ్యే సీరియల్స్ కి వెండితెర సినిమాల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు. అంతేకాకుండా బుల్లితెరలో కూడా ప్రేక్షకులకు అభిమాన హీరో, హీరోయిన్స్ కూడా ఉన్నారు.

    Star Maa Parivaar Championship: బుల్లితెరలో ప్రసారమయ్యే సీరియల్స్ కి వెండితెర సినిమాల కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉందనే చెప్పవచ్చు. అంతేకాకుండా బుల్లితెరలో కూడా ప్రేక్షకులకు అభిమాన హీరో, హీరోయిన్స్ కూడా ఉన్నారు. రేటింగ్ విషయంలో కూడా టీవీ ఛానెల్స్ కు సీరియల్స్ ద్వారానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే అన్ని సీరియల్స్ ఒకే వేదికపై ఒకేసారి కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో పక్కన పెడితే.. అభిమానులకు మాత్రం పెద్ద పండగ వాతావరణమనే చెప్పవచ్చు.

    అలాంటి పండగ వాతావరణమే త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అంతేకాకుండా బుల్లితెరలో ఇప్పటివరకు జరగని సందడి ఒకేసారి 50 మంది కంటే ఎక్కువ టీవీ సెలబ్రిటీలు పాల్గొని బాగా రచ్చరచ్చ చేశారు. ఇక ఈ షోకు యాంకర్ సుమ హోస్టింగ్ చేయనుండగా.. అక్కడున్న సెలబ్రిటీలందర్నీ చూసి షాక్ అవుతూ ఎక్కడ చూసినా తన ఫ్యామిలీ కనిపిస్తుందంటూ మురిసిపోయింది.

    https://youtu.be/I6W1NSUK3vU

    ఇక సుమ యాంకరింగ్ చేస్తున్న సమయంలో మరో బుల్లితెర గ్లామర్ యాంకర్ శ్రీముఖి వచ్చి.. నన్ను చెప్పనీవు అక్క అంటూ ఎప్పుడు నువ్వే తొక్కేస్తావ్ అంటూ కాస్త కామెడీని క్రియేట్ చేసింది. ఇక సుమ వెంటనే శ్రీముఖిని తొక్కేసే పర్సనాలిటా ఇది అంటూ కౌంటర్ విసిరింది. అంతే కాకుండా సెలబ్రిటీలు అంతా 18 అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ముందుకు వస్తున్నారు. ఇక ముక్కు అవినాష్ లేడి గెటప్ లో ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపం సీరియల్ లో ఈ దీపం పెట్టొచ్చు కదా అంటూ నవ్వించాడు. పలువురు సింగర్స్ కూడా తమ పాటలతో బాగా సందడి చేశారు. కొందరు కమెడియన్స్ కూడా ఈ షోలో పాల్గొని తమ కామెడీతో నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో విడుదల కాగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఇక కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ ప్రోమో కి తెగ లైక్స్ కూడా వచ్చాయి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Gruhalakshmi, Guppedantha manasu, Karthika deepam, Mukku avinash, Srimukhi, Star Maa, Star Maa Parivaar Championship, Suma, Vadinamma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు