ప్రభాస్ కోసం ప్రత్యేకంగా హాస్పిటల్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ సెట్ వేయనున్నారు.

news18-telugu
Updated: June 22, 2020, 5:58 PM IST
ప్రభాస్ కోసం ప్రత్యేకంగా హాస్పిటల్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రభాస్ Photo : Twitter
  • Share this:
సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ యూరప్‌లో జరిగింది. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ప్రభాస్.. ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని వెరైటీ పాత్రను చేయనున్నట్టు సమాచారం.  పూజా హెగ్డే పంతులమ్మ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను 1970-80 పీరియాడికల్ నేపథ్యంలో  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ ముందు జార్జియాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పట్లో వేరే దేశంలో షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అలనాటి కాలానికి సంబంధించిన హాస్పిటల్ సెట్‌‌ను రూపొందించనున్నారు. దీని కోసం రూ. 5 కోట్లను ఖర్చు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ భారీ సెట్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు.
First published: June 22, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading