• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • 5 BOLLYWOOD HITS INSPIRED FROM REGIONAL CHARTBUSTERS MK GH

Bollywood Songs: 'చిక్నీ చమేలీ' నుంచి 'సీటీమార్' వరకు... బాలీవుడ్ నోట ప్రాంతీయ పాట

Bollywood Songs: 'చిక్నీ చమేలీ' నుంచి 'సీటీమార్' వరకు... బాలీవుడ్ నోట ప్రాంతీయ పాట

అల్లు అర్జున్‌ డాన్స్ మూమెంట్స్‌ను మెచ్చుకున్న సల్మాన్ ఖాన్ (Twitter/Photo)

ఒకప్పుడు బాలీవుడ్ సాంగ్స్ యువతను ఉర్రూతలూగించేవి. ముఖ్యంగా హిందీ, పంజాబీ పాటలు దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల మనస్సు దోచుకున్నాయి. అయితే అది ఒకప్పుడు. ప్రస్తుతం ఉత్తరాదిన ప్రాంతీయ పాటల హవా నడుస్తోంది.

  • Share this:
ఒకప్పుడు బాలీవుడ్ సాంగ్స్ యువతను ఉర్రూతలూగించేవి. ముఖ్యంగా హిందీ, పంజాబీ పాటలు దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల మనస్సు దోచుకున్నాయి. అయితే అది ఒకప్పుడు. ప్రస్తుతం ఉత్తరాదిన ప్రాంతీయ పాటల హవా నడుస్తోంది. నిన్నటి "దింక్ చికా" నుంచి నేటి "సీటీ మార్" వరకు ప్రాంతీయ భాషల సాంగ్స్ బాలీవుడ్ శ్రోతలను మైమరపిస్తున్నాయి. వాటిని రీమిక్స్ చేసి బాలీవుడ్‌లో హిట్ల మీద హిట్లు అందుకుంటున్నారు సంగీత దర్శకులు. వీటిలో టాప్-5 ప్రాంతీయ పాటలేంటో ఇప్పుడు చూద్దాం.

సీటీమార్..
2017లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన తెలుగు సినిమా ‘డీజే’లోని 'సీటీమార్' సాంగ్ సూపర్ హిట్ అయింది. పాట కంటే స్టైలిష్ స్టార్ డ్యాన్సులు, పూజా హెగ్డే అందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ హిందీలోనూ విడుదలైంది. సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రంలో ఈ పాటను రీమేక్ చేశారు. ఇందులో సల్మాన్, దిశా పటానీ అలరించారు. తనదైన శైలిలో సల్మాన్ అలరించినప్పటికీ ఒరిజినల్ సాంగ్‌తో పోల్చిచూసినప్పుడు మిశ్రమ ఘళాలు వినిపిస్తున్నాయి. ఈ పాటకు కూడా దేవిశ్రీనే సంగీతం అందించాడు.



దింక్ చికా..
సీటీమార్ కంటే ముందు అల్లు అర్జున్ మరో పాటను కూడా సల్లూ భాయ్ తన సినిమాలో వాడుకున్నారు. అదే 'దింక్ చికా'. రెడీ సినిమా కోసం దింక్ చికా పాటను స్వరపరిచారు దేవిశ్రీ ప్రసాద్. 2011లో విడుదలైన ఈ సినిమాలో ఈ పాట ఎంతో విజయవంతమైంది. ఉత్తరాది అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఈ పాటను ముందు 2009లో వచ్చిన ఆర్య-2 సినిమాలో వాడారు. 'రింగా రింగా' అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్స్.. కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.



ఆ అంటే అమలాపురం..
2004లో తెలుగులో విడుదలైన ఆర్య సినిమాలో హైలెట్ సాంగ్ 'ఆ అంటే అమలాపురం'. అయితే ఇదే పాటను బాలివుడ్‌లోనూ రీమిక్స్ చేశారు. సోనూసూద్ నటించిన 'మ్యాగ్జిమమ్' చిత్రంలో ఈ పాట ఉంది. అయితే ఆరంభంలో ఆకట్టుకున్నప్పటికీ అనంతరం శ్రోతలను పెద్దగా మెప్పించలేకపోయింది.



జింగాట్..
మరాఠీ చిత్రాలనగానే గుర్తకువచ్చేది 'సైరత్' సినిమానే. భాషలకు అతీతంగా అందర్నీ అలరించిన సినిమా ఇది. ముఖ్యంగా ఇందులో ఉన్న 'జింగాట్' పాన్ ఇండియా సాంగ్‌గా హిట్ అయింది. సైరత్ చిత్రాన్ని హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేయగా.. అందులోనూ ఈ పాటను రీమిక్స్ చేశారు. హిందీలోనూ ఈ పాట విజయవంతమైంది.



చిక్నీ చమేలీ..
జింగాట్ తర్వాత హిందీ ఆ స్థాయిలో విజయవమైన పాట 'చిక్నీ చమేలీ'. 2006లో మరాఠీ కామెడీ సినిమా జాత్రాలో ఉపయోగించారు. అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాటను 2012లో హృతిక్ నటించిన 'అగ్నిపథ్' సినిమా కోసం రీమిక్స్ చేశారు. శ్రేయా ఘోషల్ పాడిన చమేలీ సాంగ్ పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.



ముఖ్యంగా పాటకు కత్రినా కైఫ్ స్టెప్పులు పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
Published by:Krishna Adithya
First published: