30 Years Pruthvi : కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసైన పృథ్వీ.... ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు వైసీపీలో కొనసాగిన ఈయన తాజాగా ఇపుడు ముఖ్యమంత్రి జగన్ పై తిరుగుబావుటా ఎగరేసారు.
30 Years Pruthvi : కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసైన పృథ్వీ.... ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లౌక్యం’తో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్‌గా బిజీ అయిపోయాడు. అటు ఎం.ఎస్. నారాయణ మరణం ఈయనకు బాగానే కలిసొచ్చింది. ఇక కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్‌ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసాడు. అందుకు ప్రతిఫలంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఏకంగా చైర్మన్ చేసేసాడు. ఆ తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజకీయాల్లో సినిమాల్లో అవకాశాలు లేక రెంటికీ చెడ్డ రేవడిలా మారింది పృథ్వీ.
స్వతహాగా మంచి నటుడిగా పేరున్న పృథ్వీరాజ్ తనదైన నటనతో ఆహార్యంతో ఎస్వీబీసీ కోసం ప్రత్యేక ప్రోమోలను తనపై రూపొందించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. .అటు రాజకీయాల్లో ఉన్నపుడు నాలుకను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందో పృథ్వీని చూస్తే అర్ధమవుతోంది. వైసీపీలో ఉన్న ఆలీ వంటి నటులున్న .. సినీ నటులను విమర్శించిన దాఖలాలు లేవు. కానీ పృథ్వీ ఓ వైపు మెగా ఫ్యామిలీతో పాటు మరోవైపు నందమూరి బాలకృష్ణ వంటి ఇండస్ట్రీ బడా హీరోలను నోటికొచ్చినట్టు దూషణల పర్వం చేసాడు. దానికి తగ్గట్టు రాజకీయాల్లో ఈయన హీరోలపై చేసిన దూషణలతో ఈయనకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి.
ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ..ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే.. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చించేసి నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారు. అలాగే తన మీద బట్ట కాల్చి వేసినట్టు తనపై లేనిపోని అభాండాలు వేసి వదిలేసారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇందులో తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కాస్త ఆవేశంగా చెప్పుకొచ్చాడు.
అటు రాజకీయంగా సినిమాల పరంగా నష్టపోయిన పృథ్వీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల కారణంగా తాను సినిమా రంగంలో అవకాశాలు తగ్గాయన్నారు. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వెల్లగక్కారు. రాజకీయాల్లో నా లాంటి ముక్కుసూటి మనిషికి పడవనే విషయం అర్ధమైంది. తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి వస్తే.. అంతా ఆ శ్రీవారి కృప అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా వెనకాల గోతులు తీస్తారని అసలు ఊహించలేదున్నారు. జరిగిన పరిణామాలు నాకో గొప్ప గుణపాఠం నేర్పాయి. ఈ రాజకీయాలు కారణంగా అందరూ బాగానే ఉన్నా.. నేను మాత్రం రోడ్డున పడ్డానన్నారు. ఈ సందర్భంగా ఇన్‌డైరెక్ట్‌గా వై.యస్. జగన్ తీరుపై మండిపడ్డారు.
ఎవరు చెప్పారని నేను పవన్ కళ్యాణ్‌ను ఫాలో కావడం లేదు. ఆత్మ గౌరవానికి, అహంకారానికీ మధ్య జరిగిన పోరాటం అన్నారు. నేను దాన్ని ఫాలో అవుతాను. నేను రాజకీయాల్లో భాగంగా చిరంజీవిని తిట్టినా.. ఆయన దయ తలిచి తాను హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో అవకాశం ఇచ్చిన మంచి మనిషి అని మరోసారి మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యే వ్యాఖ్యలు చేశారు.
30 ఇయర్స్ పృథ్వీ (File/Photo)
నా జీవితానుభవాల నేపథ్యంలో బంధువులతో పాటు స్నేహితులను నమ్మడం మానేశాను. చరిత్రలో జరిగిన వెన్నుపోట్లు గురించి ఎన్నో చూసాను విన్నాను. కానీ నాకు జరిగిన వెన్నుపోట్లు మరిచిపోలేనన్నారు. 2020లో కరోనా సోకినపుడు తాను బతుకుతానో లేదో అన్న టైమ్‌లో సినీ పరిశ్రమ తనకు ఎంతో చేయూత నిచ్చిందన్నారు. సాయి కుమార్, జీవితా రాజశేఖర్ వంటి తనకు అండగా నిలబడిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
30 ఇయర్స్ పృథ్వీ రాజ్ పవన్ కళ్యాణ్ (30 years prudhvi pawan kalyan)
అసలు నా లాంటి వాళ్లకు అసలు రాజకీయాలే పడవు. వెనకాల కొండను చూసుకొని అంటూ వై.యస్.జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాను. దీంతో ఫుట్‌బాల్ లా ఎక్కడో పోయిపడ్డాను. త్వరలో చిరంజీవితో పాటు అశ్వనీదత్ వంటి పెద్ద నిర్మాతలను కలిసి నా తప్పును క్షమించమని కోరుతానన్నారు. మార్పు కోసం నేను ఒక అడుగు వేస్తే మీరు వంద అడుగులు ముందుండి నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ వినయం పృథ్వీ అర్ధించారు. మొత్తంగా పృథ్వీ చేసిన ఈ రిక్వెస్ట్ సినీ ఇండస్ట్రీ మన్నిస్తుందా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.