కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసైన పృథ్వీ.... ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లౌక్యం’తో ఓవర్ నైట్ బిజీ అయిపోయాడు. కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్‌ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసాడు. అందుకు ప్రతిఫలంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఏకంగా చైర్మన్ చేసేసాడు. ఆ తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజకీయాల్లో సినిమాల్లో అవకాశాలు లేక రెంటికీ చెడ్డ రేవడిలా మారింది పృథ్వీ. తాజాగా ఆయన ఒక టీవీ ఛానెల్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే.. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చించేసి నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారు. అలాగే తన మీద బట్ట కాల్చి వేసినట్టు తనపై లేనిపోని అభాండాలు వేసి వదిలేసారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఇందులో తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కాస్త ఆవేశంగా చెప్పుకొచ్చాడు.
పృథ్వీ రాజ్ (File)
తనను ఇబ్బంది పెట్టిన వారెవరూ ఇపుడు బతికి లేరని.. తను ఇరికించిన వారంత నాశనమైపోతారన్నారు. తన వెనక గోతులు తీసింది తన సొంత పార్టీకి వైసీపీ నేతలే ఉన్నారని సంచలన ఆరోపణలు చేసారు. తప్పు చేయకున్నా.. తాను ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని చెప్పారు. తనను సీఎం జగన్ రాజీనామా చేయాలని కోరలేదన్నారు. సుబ్బారెడ్డి కోరడంతోనే తాను రాజీనామా లేఖను సమర్పించినట్టు చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్లో తాను బ్యాడ్ అయ్యేలా చెప్పుతో కొట్టి బయటకు తోసేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పృథ్వీ. అంతేకాదు ఎస్వీబీసీ ఎపిసోడ్‌కు ఒకటి రెండు రోజులు ముందు ఒక ఛానెల్ సీఈవో తనను బెదిరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మొత్తానికి పృథ్వీ వ్యవహారం.. అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు కాకుండా పోయాడానే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.