Home /News /movies /

30 YEARS PRUDHVI REVELED SAYS THAT MEGASTAR CHIRANJEEVI SUPPORTED HIM WHEN THINKS ABOUT SUICIDE PK

సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. చిరంజీవి కాపాడాడంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..

చిరంజీవి పృథ్వీ

చిరంజీవి పృథ్వీ

30 Years Prudhvi: క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

క‌మెడియ‌న్లు కామెడీ చేయాలి.. న‌వ్వించాలి.. కానీ అంద‌రి ముందు తాము చేసే వ్యాఖ్య‌ల‌తో న‌వ్వుల పాలు కాకూడ‌దు క‌దా. వాళ్ల‌పై వాళ్లే క‌మెంట్స్ చేసుకుని దిగ‌జారిపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్స్ ఎంత‌మంది ఉన్నా అంద‌రికీ మంచి పేరుంది. కానీ ఈ మ‌ధ్య ఎందుకో తెలియ‌దు కానీ 30 ఇయ‌ర్స్ పృథ్వీ మాత్రం కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నాడు. కావాల‌నే అంద‌రితోనూ సున్నం పెట్టుకుంటున్నాడు ఈయ‌న‌. మొన్న‌టికి మొన్న ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ.. మ‌రో క‌మెడియ‌న్, కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లపై కూడా విరుచుకుపడ్డాడు పృథ్వీ.

పృథ్వీ (30 years Prudhvi)
పృథ్వీ (30 years Prudhvi)


ఆ త‌ర్వాత క‌మెడియ‌న్ సునీల్‌పై కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసాడు పృథ్వీ. సునీల్ రీ ఎంట్రీ త‌ర్వాత పొడిచేదేం లేదన్నాడు. ఆ త‌ర్వాత ఏకంగా సినిమా ఇండ‌స్ట్రీపైనే నోరు పారేసుకున్నాడు. వైఎస్ జ‌గ‌న్ గెలిచినా కూడా ఎవ‌రూ వ‌చ్చి విష్ చేయ‌డం లేదంటూ అంద‌రిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక తర్వాత ఏకంగా మెగా కుటుంబాన్నే టార్గెట్ చేసాడు ఈయ‌న‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో కావాల‌నే మెగా హీరోలంద‌ర్నీ ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శించాడు పృథ్వీ. ఆ తర్వాత మెగా కుటుంబంతో తనకేం శత్రుత్వం లేదని.. అంతా తనకు స్నేహితులే అని చెప్పుకొచ్చాడు ఈయన.

పృథ్వీ (30 years Prudhvi)
పృథ్వీ (30 years Prudhvi)


దానికి ముందు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌లుకొని నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్ లాంటి వాళ్ల‌పై కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేసాడు ఈ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ. అప్పుడు జ‌న‌సేన పార్టీకి నాగ‌బాబు ఇచ్చిన కోటి రూపాయ‌లు అక్ర‌మంగా సంపాదించినవి కాదా అంటూ రెచ్చిపోయాడు ఈయ‌న‌. త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ పార్టీ గురించి కూడా కామెంట్స్ చేసాడు. ఇవ‌న్నీ మెగా హీరోల‌కు బాగానే కోపం తెప్పించాయి. దాంతో ఇప్పుడు మెగా హీరోల సినిమాల్లో పృథ్వీని తీసుకోకూడ‌దనే వాద‌న వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆ మ‌ధ్య ఓ మెగా హీరో సినిమా నుంచి పృథ్వీని త‌ప్పించారు కూడా. ఆ తర్వాత చిరంజీవి సైరాలో ఈయన మంచి పాత్రే చేసాడు. అలాంటిదేం లేదని.. తనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెబుతున్నాడు.

30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)
30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన విషయాలు తెలిపాడు పృథ్వీ. ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవాడు లేడు.. కనీసం ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని చెప్పాడు ఈయన. తన చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఓ సమయంలో చచ్చిపోవాలనుకున్నానని.. అప్పుడు తనకు అండగా నిలిచింది చిరంజీవి అంటున్నాడు ఈయన. పాపం వాడెలా ఉన్నాడో చూడండ్రా అంటూ కొందరికి చెప్పాడని.. అంత గొప్పవాడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పాడు పృథ్వీ. మిగిలిన వాళ్లు కూడా ఉన్నారేమో కానీ తన దృష్టిలో మాత్రం చిరంజీవే గొప్పోడు అంటున్నాడు ఈయన. మొత్తానికి ఇప్పుడు ఈ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: 30 Years Prudhvi Raj, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు