హోమ్ /వార్తలు /సినిమా /

30 Years Prudhvi Raj: షారుఖ్‌కు 30 ఇయర్స్ పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్.. పఠాన్‌కు ఇక్కడ రిలీజ్ కానివ్వం అంటూ..

30 Years Prudhvi Raj: షారుఖ్‌కు 30 ఇయర్స్ పృథ్వీ స్ట్రాంగ్ వార్నింగ్.. పఠాన్‌కు ఇక్కడ రిలీజ్ కానివ్వం అంటూ..

షారుఖ్ ఖాన్‌కు 30 ఇయర్స్ పృథ్వీ స్ట్రాంగ్ కౌంటర్ (File/Photo)

షారుఖ్ ఖాన్‌కు 30 ఇయర్స్ పృథ్వీ స్ట్రాంగ్ కౌంటర్ (File/Photo)

30 Years Prudhvi : నటుడు రాజకీయ నేత పృథ్వీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా వైసీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఎపుడు వివాదాలతో సహవాసం చేసే ఈయన తాజాగా షారుఖ్ ఖాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పఠాన్ మూవీ వివాదంపై స్పందించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

30 Years Prudhvi : నటుడు రాజకీయ నేత పృథ్వీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా వైసీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఎపుడు వివాదాలతో సహవాసం చేసే ఈయన తాజాగా షారుఖ్ ఖాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పఠాన్ మూవీ వివాదంపై స్పందించారు. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన ‘బేషరమ్ రంగ్’ పై పాటపై హిందూత్వ సంఘాలు ఈ సినిమాతో పాటు షారుఖ్ పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పాటలో దీపికా .. కాషాయం కలర్ రంగును చూపిస్తూ.. షారుఖ్.. బేషరమ్ రంగ్ అంటూ పాట పాడటం వివాదానికి తావిచ్చింది. కాషాయాన్ని హిందువులు త్యాగానికి గుర్తుగా పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి రంగును ఈ పాటలో బేషరమ్ అంటే ‘సిగ్గులేని రంగు అంటూ సంభోధించడం పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

అయితే.. షారుఖ్ ఈ పాటను కావాలనే  తన  ‘పఠాన్’ మూవీ ప్రమోషన్‌‌లో భాగంగా వార్తల్లో నిలవాలనే పెట్టారని కొంత మంది నెటిజన్స్ పేర్కొంటే.. మరికొందరు ఏదో క్యాజువల్‌గా పెట్టారని మరికొందరు రక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా హిందూ సంఘాలు మాత్రం ఈ పాటను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే థియేటర్స్‌లో తెరలు చినిగిపోవడం ఖాయం అంటున్నారు. తాజాగా ఈ 30 ఇయర్స్ పృథ్వీ ..షిరిడి సాయి బాబా దర్శనానికి వచ్చిన న్యూస్ 18తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా   షారుఖ్ ‘పఠాన్’ మూవీపై తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు.

మన దేశంలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను మన దేశం  గౌరవిస్తుంది, కానీ పఠాన్ లాంటి సినిమా దక్షిణాది ప్రజలు  ఎప్పటికీ ప్రమోట్ చేయురు. . దక్షిణాది సినిమాల్లో భారతీయ సంస్కృతి పెద్ద పీఠ వేస్తారు, కానీ బాలీవుడ్  మాత్రం భారతీయ సంస్కృతిని పదేపదే దెబ్బతీస్తుంది, కాబట్టి పఠాన్ చిత్రాన్ని బహిష్కరించాలని నిర్ణయించడం ఒక విధంగా సరైనదన్నారు.

సౌత్‌లో ఈ సినిమాను విడుదల కానివ్వం అన్నారు. భారతీయ సంస్కృతిని కించ పరిచేలా ఎవరు సినిమా చేసినా.. దాన్ని బహిష్కరించాల్సిందే అన్నారు. ఇలాంటి పనులకు మన దేశంలో చోటు ఉండకూడతున్నారు.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ భారతీయ సంస్కృతిని కాపాడేలా సినిమాలను నిర్మించాలి. భారతీయ పరిశ్రమ బాగున్నపుడే పాశ్చాత్య సంస్కృతిని ఆచరించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి సంప్రదాలయను ప్రతిబింబించినందుకే బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కార్తీకేయ, కేజీఎఫ్ వంటి చిత్రాలను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించిన విషయాలను ప్రస్తావించారు.ఇక టెక్నికల్ గా టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఎపుడో దాటేసింది. ఇక తెలుగు కంటే హిందీ చిత్ర పరిశ్రం ఏం తక్కువ కాదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కించపరిచే సినిమాలు మనకు వద్దు అన్నారు. మన దేవీ, దేవతలను, సంస్కృతిని ఉన్నతంగా చూపిస్తే ప్రజలు స్వాగతిస్తారు కానీ.. కించ పరిచే సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించన్నారు. మొత్తంగా పృథ్వీ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Bollywood news, Pathaan Movie, Shah Rukh Khan, Tollywood

ఉత్తమ కథలు