అన్నమయ్య అవతారం ఎత్తిన 30 ఇయర్స్ పృథ్వీ...నాగార్జున దిగదుడుపే...

తాజాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎస్వీబీసీ చానెల్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోల్లో పృథ్వీ భక్త అన్నమయ్య అవతారం ఎత్తి కీర్తనలు ఆలపిస్తూ కనిపించాడు. దీంతో అటు సినీ పరిశ్రమ వర్గాలతో పాటు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

news18-telugu
Updated: October 5, 2019, 8:47 PM IST
అన్నమయ్య అవతారం ఎత్తిన 30 ఇయర్స్ పృథ్వీ...నాగార్జున దిగదుడుపే...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ (Image: SVBC Channel)
news18-telugu
Updated: October 5, 2019, 8:47 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అధికారిక భక్తి ఛానెల్ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సినీనటుడు పృథ్వీరాజ్ తన మార్కు చూపించేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎస్వీబీసీ చానెల్ లో విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోల్లో పృథ్వీ భక్త అన్నమయ్య అవతారం ఎత్తి కీర్తనలు ఆలపిస్తూ కనిపించాడు. దీంతో అటు సినీ పరిశ్రమ వర్గాలతో పాటు పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాడు. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు రాఘవేందర్ రావు బాధ్యతలు నిర్వహించి తనదైన మార్కును చూపించారు. అయితే దర్శకేంద్రుడి సీటులో బాధ్యతలు చేపట్టిన పృథ్వీ ఎలాగైనా ఎస్వీబీసీను ముందుండి నడిపించాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా మంచి నటుడిగా పేరున్న పృథ్వీరాజ్ తనదైన నటనతో ఆహార్యంతో ప్రత్యేక ప్రోమోలను రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో తాను అలంకార ప్రాయంగా కూర్చోలేదని, సీరియస్ గానే పనిచేస్తున్నట్లు మెసేజ్ కూడా పృథ్వీ పంపించారు.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...