30 Rojullo Preminchadam Ela First Day Collections: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రదీప్ మాములోడు కాదుగా..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మొదటి రోజు కలెెక్షన్లు (Pradeep 30 Rojullo Preminchadam Ela review)

30 Rojullo Preminchadam Ela First Day Collections: యాంకర్ ప్రదీప్‌మాచిరాజు గురించి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన హీరోగా నటించిన సినిమా నిన్న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళు చేసిందంటే..

  • Share this:
    30 Rojullo Preminchadam Ela First Day Collections: యాంకర్ ప్రదీప్‌మాచిరాజు గురించి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతున్నాడు. తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్.. తాజాగా 30 రోజుల్లో ప్రేమించండం ఎలా అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రదీప్ గతంలో యాంకర్‌గా ఉంటూనే కొన్ని సినిమాల్లో నటించినా ఈసారి.. సోలో హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వచ్చాడు.. కరోనా లేకపోతే.. ఈ పాటికి ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. తాజాగా నిన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడులైంది. ఈ సినిమాకు యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది.

    ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్సే రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే రూ. 1 కోటి రూపాయాలకు పైగా షేర్ వసూళు చేసినట్టు సమాచారం. మొత్తంగా రూ. రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  ఒక యాంకర్ హీరోగా నటించిన సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం మాములు విషయం కాదు. మొత్తంగా యావరేజ్‌ టాక్‌తో మొదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం.  రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఈ రోజు.. వీకెండ్ కలిపి ఎంత వసూళు చేస్తుందనే దానిపై 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: