మరో 3 సినిమాలతో వస్తున్న ఆది... హిట్ కొడతాడా

AADI : టాలీవుడ్‌లో ఏ హీరో అయినా హిట్లు లేకుండా ఎక్కువ కాలం నిలవడం కష్టం. మరి ఆది ఎలా నెగ్గుకొస్తున్నాడు?

news18-telugu
Updated: December 24, 2019, 6:16 AM IST
మరో 3 సినిమాలతో వస్తున్న ఆది... హిట్ కొడతాడా
శశి పోస్టర్ (credit - insta - aadi)
  • Share this:
AADI : టాలీవుడ్ కనిపించని పులి సాయికిరణ్ కొడుకైన ఆది... 8 ఏళ్లుగా ఎన్ని సినిమాలు చేశాడో తెలుసా? 10. వాటిలో హిట్టైంది మొదటి సినిమా ప్రేమ కావాలి మాత్రమే. మిగతావన్నీ అలా అలా ఆడినవే. అప్పట్లో వచ్చిన లవ్లీ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఈ ఏడాది వచ్చిన బుర్రకథ, జోడి ఇటీవల వచ్చిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మాత్రం... ఎప్పుడొచ్చాయో తెలియదన్నట్లుగా వచ్చి వెళ్లాయి. మరి ఇన్ని సినిమాలు చేసినా... అన్నీ ఫ్లాపే అవుతున్నా... ఇండస్ట్రీలో నిలబడగలగడం గ్రేటే అనుకోవచ్చు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. ఆది డాన్స్ బాగా చేస్తాడు. నటనలో కూడా పర్వాలేదు. హీరోకి సంబంధించిన క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. దానికి తోడు సాయికిరణ్ కొడుకు కావడం మరో ప్లస్ పాయింట్. తనకంటూ ప్రత్యేకంగా కొంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న ఆది... పెద్ద పెద్ద ప్రాజెక్టులకు వెళ్లి... నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... చిన్న ప్రాజెక్టులతోనే ముందుకెళ్తున్నాడు. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న ఈ క్రేజీ హీరో... మరో మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు.


కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు చేస్తున్న ‘శశి’ ప్రాజెక్టులో ఆది హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటూ... ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.

జిబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న సినిమాకి కూడా ఆది సైన్ చేశాడు. జనవరిలో ఇది సెట్స్‌పైకి వెళ్తోంది. మరో కొత్త దర్శకుడు శివ శంకర్ దేవ్‌ ప్రాజెక్టుకీ ఆది సైన్ చేశాడు. ఈ మూడు సినిమాలూ... థ్రిల్లర్ కథాంశాలతో వస్తున్నవే. సినిమా సినిమాకీ కొంతైనా వైవిధ్యం చూపిస్తున్న ఆది... 2020లో నైనా హిట్ కొడితే... ఇండస్ట్రీకీ మంచిదే.
Published by: Krishna Kumar N
First published: December 24, 2019, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading