Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: March 31, 2019, 9:17 PM IST
టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
2019 వచ్చి అపుడే మూడు నెలలు కంప్లీట్ కావొస్తోంది. ఈ త్రీ మంత్స్‌లో ఎవరెవరు సక్సెస్ అందుకున్నారు. ఎవరు అంచనాలు అందుకోలేకపోయారు. మూడు నెలల బాక్సాఫీస్ రిపోర్ట్‌ను ఒకసారి పరిశీలిస్తే..ఈ మూడు నెలల్లో సంక్రాంతి కానుకగా నలుగురు పెద్ద స్టార్స్ తమ లక్‌ను పరీక్షించుకున్నారు. ముందుగా పొంగల్ బరిలో జనవరి 9 బాలకృష్ణ..తన తండ్రి వెండితెరపై జీవితంపై క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్న కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత రజినీకాంత్ డబ్బింగ్ మూవీ ‘పేట’ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినా కమర్షియల్‌గా ఈ సినిమా రూ.90 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. మరోవైపు సంక్రాంతి పండగ చివర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

సంక్రాంతి సినిమాలు 2019
‘ఎఫ్ 2’ సినిమా రూ.120 కోట్ల గ్రాస్.. రూ 80 కోట్ల షేర్ రాబట్టి ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక జనవరి చివరి వారంలో అఖిల్ హీరోగా నటించిన ‘Mr.మజ్ను’ ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.ఇక ఫిబ్రవరిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఆ తర్వాత కమెడియన్స్ ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన ‘మిఠాయి’ ఆడియన్స్‌ను నిరాశ పరిచింది. మరోవైపు ఎన్టీఆర్ కథానాయకుడుతో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. రామారావు రాజకీయ జీవితం నేపథ్యంలో తీసిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

ఎన్టీఆర్ వైఎస్ఆర్ బయోపిక్స్
మార్చి 1న కళ్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘118’ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది. ఇక అంతా వాళ్లతో తెరకెక్కిన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక ముఖ్యపాత్రలో తెరకెక్కిన ‘సూర్యకాంతం’ సినిమా సోదిలో లేకుండా పోయింది.ఇక క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవితంపై కథానాయకుడు,మహానాయకుడు సినిమాలను తెరకెక్కిస్తే..వివాదాస్పదమైన మూడో భాగాన్ని రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’గా తెరపై ఆవిష్కరించాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఓ దృశ్యం (Twitter)
ఈసినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్లోకి ఎంటరైంది. మొత్తానికి మూడు నెలల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ మూడు హిట్లు..ఆరు ప్లాపులుగా నిలిచింది.
First published:
March 31, 2019, 9:17 PM IST