"అర‌వింద స‌మేత"లో ఆ మూడు సీన్స్ పూనకాలే..

ఫ్యాక్ష‌న్ సినిమాలు తీసి పండిపోయిన ద‌ర్శ‌కుల‌కు సైతం రాని కొన్ని ఆలోచ‌న‌లు త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌లో చూపించాడు. ఇదే సినిమాను నిల‌బెడుతున్నాయిప్పుడు. అంతా వాటి గురించే మాట్లాడుకుంటున్నారు కూడా. అసలు త్రివిక్రమ్ బుర్ర ఎలా ఇలా పనిచేసింది అని ఆలోచిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 12, 2018, 10:34 AM IST
అర‌వింద స‌మేత‌
  • Share this:
ఇప్పుడు ఎక్క‌డ విన్నా కూడా "అర‌వింద స‌మేత" రికార్డుల గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ ఏమీ రాలేదు.. బాగుంది.. ఓ సారి చూడొచ్చు.. ద‌స‌రా సీజ‌న్ క‌దా.. హాలీడేస్ ప‌నికొస్తాయి అంటున్నారు. కానీ ఇప్పుడు రికార్డులు చూస్తుంటే మాత్రం ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ఈ సినిమా చూసి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కూడా మ‌రీ ముఖ్యంగా మూడు సీన్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా వెంబ‌డిస్తున్నాయి. అసలు త్రివిక్ర‌మ్ అలాంటి సీన్స్ డిజైన్ చేస్తాడ‌ని క‌నీసం క‌ల‌లో కూడా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.

"అర‌వింద స‌మేత"లో ఆ మూడు సీన్స్ పూనకాలే.. 3 major hghlight action scenes in aravinda sametha veera raghava..
ఎన్టీఆర్ సమేత త్రివిక్రమ్


ఫ్యాక్ష‌న్ సినిమాలు తీసి పండిపోయిన ద‌ర్శ‌కుల‌కు సైతం రాని కొన్ని ఆలోచ‌న‌లు త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌లో చూపించాడు. ఇదే సినిమాను నిల‌బెడుతున్నాయిప్పుడు. ప్రేక్ష‌కుల‌ను అంత‌గా మాయ చేస్తున్న ఆ మూడు సీన్స్ లో మొద‌టిది ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్. తెలుగు ఇండ‌స్ట్రీలో ఏ స్టార్ హీరోకు లేని విధంగా ఇందులో ఇంట్రో ఫైట్ డిజైన్ చేసాడు త్రివిక్ర‌మ్.

"అర‌వింద స‌మేత"లో ఆ మూడు సీన్స్ పూనకాలే.. 3 major hghlight action scenes in aravinda sametha veera raghava..
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్
ఆరంభంలోనే అంతం చూపించి.. అక్క‌డ్నుంచి క‌థ మొద‌లుపెట్ట‌డం త‌న మార్క్ చూపించాడు మాట‌ల మాంత్రికుడు. అంతేకాదు.. 12 నిమిషాల పాటు సాగే ఆ ఫైట్ లో అంద‌ర్నీ న‌రికిన త‌ర్వాత క‌త్తితో తొడ‌గొట్ట‌డం అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించింది. వేట అయిపోయిన త‌ర్వాత పులి మూతికంటిన ర‌క్తాన్ని తుడుచుకున్న‌ట్లుంది అంటున్నారు అభిమానులు ఆ సీన్ చూసి.

"అర‌వింద స‌మేత"లో ఆ మూడు సీన్స్ పూనకాలే.. 3 major hghlight action scenes in aravinda sametha veera raghava..
అర‌వింద స‌మేత‌


అస‌లు అలాంటి ఆలోచ‌నే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడికి రాలేదు. క‌త్తితో తొడ‌గొట్ట‌డం అనేది కొత్తగా అనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరో అలా చేయ‌లేదు. దాంతో పాటు సెకండాఫ్‌లో కాంప్ర‌మైజ్ సీన్ కూడా సినిమాను నిల‌బెట్టేసింది. యుద్ధం చేసే వాడికే శాంతి గురించి మాట్లాడే అర్హ‌త ఉంది అంటూ ఓ వైపు మాట్లాడుతూనే మ‌రోవైపు ఫైట్ చేస్తాడు.. ఇది కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్లైమాక్స్ ను ఫైట్ లేకుండా ఎమోష‌న‌ల్‌గా ముగించ‌డం కూడా కొత్త‌గా అనిపిస్తుంది.
"అర‌వింద స‌మేత"లో ఆ మూడు సీన్స్ పూనకాలే.. 3 major hghlight action scenes in aravinda sametha veera raghava..
‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ పోస్టర్


ఇన్నాళ్లూ ఫ్యాక్ష‌న్ సినిమాల క‌థ ఎక్క‌డ ముగుస్తుందో.. అక్క‌డ త‌న క‌థ‌కు ఆరంభం రాసుకున్నాడు మాట‌ల మాంత్రికుడు. అది కూడా కొత్త‌ద‌న‌మే. యుద్ధం అయిన త‌ర్వాత ఉండే దృశ్యాల‌ను చూపించాల‌నుకున్నాడు త్రివిక్ర‌మ్. ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు మాట‌ల మాంత్రికుడు. మొత్తానికి ఈ మూడు సీన్స్ అర‌వింద స‌మేత‌కు ప్రాణం పోసాయి. ఇదే ఇప్పుడు సినిమాను రికార్డుల వైపుగా న‌డిపిస్తున్నాయి.
First published: October 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు