Home /News /movies /

చిరు ‘సైరా’ సినిమా కోసం మెగా కంపౌండ్ తిప్పలు.. అనుకున్న టైమ్‌కు రిలీజ్ కావాలంటే..

చిరు ‘సైరా’ సినిమా కోసం మెగా కంపౌండ్ తిప్పలు.. అనుకున్న టైమ్‌కు రిలీజ్ కావాలంటే..

‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)

‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవి (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం చిరంజీవి..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్‌ను రీసెంట్‌గా కంప్లీట్ చేసాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి మెగా కాంపౌండ్ పడరాని పాట్లు పడుతోంది. వివరాల్లోకి వెళితే..

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం చిరంజీవి..‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్‌ను రీసెంట్‌గా కంప్లీట్ చేసాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కాస్తంత బ్రేక్ ఇచ్చాడు. ఇక సైరాకు నిర్మాత కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత రామ్ చరణ్ పై పడింది. ఎప్పుడో 19వ శతాబ్ధానికి చెందిన స్టోరీ కావడంతో ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్‌ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక సీజీ వర్క్స్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమాను ఇప్పటికే అనుకున్న అక్టోబర్ 2న విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి  విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మెగా కాంపౌండ్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2నే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సినిమాకు కీలకమైన గ్రాఫిక్స్ వర్క్స్‌ను  వివిధ దేశాలకు చెందిన 26 కంపెనీలకు అప్పగించినట్టు సమాచారం.

    Ram Charan Chiranjeevi to share the screen space for 4th time in Koratala Siva movie pk తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ట్రెండ్ మామూలుగా లేదు. క‌థ న‌చ్చితే ఎవ‌రైనా న‌టించ‌డానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలోని హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. ram charan instagram,ram charan twitter,ram charan rrr movie,chiranjeevi nayanthara,ram charan chiranjeevi,chiranjeevi ram charan koratala movie,chiranjeevi koratala siva movie,chiranjeevi koratala movie,chiru koratala movie,chiranjeevi movies,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi sye raa movie,chiranjeevi ram charan movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,చిరు కొరటాల శివ,చిరు చరణ్ కొరటాల,కొరటాల చిరంజీవి సినిమా,కొరటాల శివ చిరంజీవి సినిమా,తెలుగు సినిమా
    చిరంజీవి రామ్ చరణ్ ఫైల్ ఫోటోస్


    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు. ఆగష్టు 15న సైమా వేడుకల్లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ‘సైరా నరసింహారెడ్డి’సినిమాకు సంబంధించిన ప్రచారా కార్యక్రమాలను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సినిమాను తెలుగులో పాటు హిందీ,తమిళంలో పాటు పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అనుకున్నట్టు ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల అవుతుందో లేదో చూడాలి.

     
    First published:

    Tags: Chiranjeevi, Ram Charan, RRR, SS Rajamouli, Surender reddy, Syeraa Narasimha Reddy, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు