ప్రదీప్‌ మాచిరాజుపై రేప్ కేసు.. యువతిపై 139 మంది రేప్ FIRలో యాంకర్ పేరు..

యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)

Pradeep Machiraju: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారింది. తనపై ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 139 మంది అత్యాచారం చేసారని..

  • Share this:
దిహైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి పెట్టిన కేసు సంచలనంగా మారింది. తనపై ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 139 మంది అత్యాచారం చేసారని.. 5000 వేల సార్లు తనను బలవంతంగా అనుభవించారని ఈమె పెట్టిన కేసు పోలీసులకు కూడా సవాల్‌గా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 25 ఏళ్ల యువతి ఈ కేసు పెట్టింది. తనపై కొన్నేళ్లుగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడం ఆసక్తిగా మారింది. పదేళ్లుగా తనను వేధిస్తున్నారని.. తనపై 139 మంది అత్యాచారం చేశారని తనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కేసుపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

బాధితురాలు


ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు. అయితే ఈ లిస్టు చూస్తున్న పోలీసులకు కొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. అందులో కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండటం విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఆ యువతిపై అత్యాచారం చేసిన వాళ్లలో ప్రముఖ యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుతో పాటు సినీ నిర్మాతలు, ఓ కెమెరా మెన్, ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్, మాజీ ఎంపీ, వాళ్ల పీఏ.. వాళ్లతో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నాడని తెలిపింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల చాలా మంది పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయి.

ప్రతీతాత్మక చిత్రం


వాళ్లపై నిర్భయ కేసుతో పాటు పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇందులో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటంతో సంచలనంగా మారుతుంది. అయితే ఇదంతా కేవలం ప్రచారం కోసమే ఆ యువతి చేస్తుందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఎందుకంటే గతంలో సాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ కూడా ఫస్ట్ వాడుకుంది ప్రదీప్ పేరునే. ఈ యాంకర్ ఓ అమ్మాయిని మోసం చేసాడంటూ మీడియా ముందుకొచ్చాడు. తర్వాత అతడు పెద్ద ఫ్రాడ్ అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కావాలనే ప్రదీప్ పేరును పాపులారిటీ కోసం వాడుకుంటుందని వాదిస్తున్నారు ప్రదీప్ సన్నిహితులు.

FIR లో యాంకర్ ప్రదీప్ పేరు
FIR లో యాంకర్ ప్రదీప్ పేరు


కావాలనే ఈయన పేరును ఇరికిస్తుందని వాళ్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు తనపై గ్యాంప్ రేప్‌లు కూడా చేసారని.. గర్భం దాల్చితే అబార్షన చేయించారని.. ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని చెబుతుంది ఆ యువతి. తనపై 5000 సార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో తాను ఈ ఫిర్యాదు చేసినట్టు తెలిపింది ఆ యువతి. అయితే ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి.. అసలు ఆ యువతి చెప్పిన దాంట్లో నిజమెంత అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏదేమైనా కూడా ప్రదీప్ పేరు ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. కానీ కొందరు మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ జిమ్మిక్కు అని కొట్టి పారేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: