• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • 21 MEMBERS TESTED CORONA POSITIVE IN TAMIL ACTOR RAGHAVA LAWRENCE TRUST IN CHENNAI PK

లారెన్స్ ఛారిటబుల్ ట్రస్టులో 21 మందికి కరోనా పాజిటివ్..

లారెన్స్ ఛారిటబుల్ ట్రస్టులో 21 మందికి కరోనా పాజిటివ్..

రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)

Raghava Lawrence: కొరియోగ్రఫర్‌గా వచ్చి హీరోగా మారి.. ఇప్పుడు దర్శకుడిగా కూడా సత్తా చూపిస్తున్న స్టార్ లారెన్స్. ఈయనకు కేవలం సినిమాలే కాకుండా సేవల్లో కూడా చాలా పేరుంది.

  • Share this:
కొరియోగ్రఫర్‌గా వచ్చి హీరోగా మారి.. ఇప్పుడు దర్శకుడిగా కూడా సత్తా చూపిస్తున్న స్టార్ లారెన్స్. ఈయనకు కేవలం సినిమాలే కాకుండా సేవల్లో కూడా చాలా పేరుంది. తనకు వచ్చిన దాంట్లోనే పదిమందికి సాయం చేస్తుంటాడు లారెన్స్. మొన్నటికి మొన్న కరోనా బాధితుల కోసం ఏకంగా 3 కోట్ల విరాళం అందించి సంచలనం రేపాడు. ఇదిలా ఉంటే ఈయన నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌లో ఏకంగా 21 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. చెన్నైలోని అశోక్‌నగర్‌లో అనాథల కోసం రాఘవ లారెన్స్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ఎంతోమంది ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు.
రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)
రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)

లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇక్కడొచ్చి ఉండొచ్చని చెప్పాడు ఆయన. ఈ క్రమంలోనే చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్ట్‌లోని సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేశారు. అందులో 21 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. లారెన్స్ ట్రస్టులోని 18 మంది పిల్లలతో పాటు ముగ్గురు ఉద్యోగులకు కూడా ఈ వ్యాధి సోకినట్టుగా నిర్ధారణ అయింది.
రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)
రాఘవ లారెన్స్ (Twitter/Lawrence)

దాంతో అందర్నీ వీరందరినీ చెన్నైలోని లయోలా కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తి చాలా ఉంది. రోజుకు వేలాది కేసులు బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌లో ఉన్న పలువురికి లక్షణాలు బయట పడటంతో పరీక్షలు చేసారు.. వాళ్లకు నిర్ధారణ అయింది. దాంతో ట్రస్టును కూడా మూసేసారు. దీన్ని వెంటనే కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు. అందరికీ త్వరగా నయం కావాలని లారెన్స్ కోరుకున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: