ఆ విషయంలో రోజాకు సరిలేరు నీకెవ్వరు..

MLA Roja | ఈ సంక్రాంతి రోజాకు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఏ సంక్రాంతికి లేనటువంటి స్పెషాలిటీ.. 2020కి ఉంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 16, 2020, 2:44 PM IST
ఆ విషయంలో రోజాకు సరిలేరు నీకెవ్వరు..
రోజా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆ విషయంలో రోజాకు సరిలేరు నీకెవ్వరు అంటున్నది ఎవరో కాదు.. ఆమె అభిమానులు. వివరాల్లోకి వెళితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున రోజా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో కాలు పెట్టారు. అంతకు ముందు రోజా అధికారిక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు సార్లు ఓడిపోయారు.  ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైపీసీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా.. అపుడు వైసీపీ అధికారంలోకి రాకుండా.. ప్రతిపక్షంలో ఉండిపోయింది. రెండోసారి మాత్రం ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రోజాపై అప్పటి వరకు ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. దీంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కుతుందని అందరు అనుకున్నారు.  చివరకు సామాజిక సమీకరణాల రీత్యా ఆమెకు క్యాబినేట్‌లో చోటు దక్కలేదు. దీంతో రోజా క్యాబినేట్ ర్యాంకుతో  సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు జగన్.

Ap latests news, ap news, Roja news, Roja latest news, ys jagan latest news
ఎమ్మెల్యే కమ్ జబర్ధస్త్ జడ్జ్ రోజా (credit - insta - madhurasdesignerstudio)


ఇక ఎమ్మెల్యేగా రోజాకు వచ్చే జీతం కంటే ఏపీఐఐసీ చైర్మన్‌గా వచ్చే జీతం అదనం. ఈ రకంగా రోజా.. ఒకవైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు ఏపీఐఐసీ చైర్మన్‌గా ఇంకోవైపు జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా తనదైన శైలిలో రాణిస్తోంది. మొత్తానికి సినిమా రంగం విషయానికొస్తే.. రోజా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు... అదికార పార్టీలో ఉండటం.. ఏపీఐఐసీ చైర్మన్ వంటి క్యాబినేట్ ర్యాంకు పోస్ట్‌లో కొనసాగడం వంటి చూస్తుంటే.. 2020 సంక్రాంతి ఎవరికైనా కలిసొచ్చిందో లేదో కానీ రోజాకు బాగానే కలిసొచ్చిందని ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading