Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: December 31, 2019, 8:35 AM IST
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Nadendla Manohar)
2019 మెగా ఫ్యామిలీకి సినిమాల పరంగా బాగానే కలిశొచ్చింది. కానీ రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్‌కు మాత్రం ఈ యేడాది కలిసిరాలేదు. సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ తో మంచి విజయాన్నే నమోదు చేసారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్..‘చిత్రలహరి’ సినిమాతో పాటు ఇయర్ ఎండింగ్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో మంచి విజయాలనే అందుకున్నాడు. ఇంకోవైపు వరుణ్ తేజ్ కూడా ‘ఎఫ్ 2’ తో పాటు ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ‘వినయ విధేయ రామ’ చిత్రంతో డిజాస్టర్ అందుకోగా.. తండ్రితో తీసిన ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రంతో నిర్మాతగా విజయం అందుకున్నాడు. సినిమాల పరంగా మెగా ఫ్యామిలీ హీరోలు సక్సెస్ రేటు బాగానే ఉన్నా.. రాజకీయాల్లో వచ్చేసరికి అంతా తలకిందులైంది.

నాగబాబు,పవన్ కళ్యాణ్
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరుపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. విశాఖలోని గాజువాకతో పాటు పశ్చిమ గోదావరిలోని భీమవరం నుంచి రెండు చోట్లా అసెంబ్లీకి పోటీ చేసారు. ఈ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ దారుణమైన పరాజయాన్ని చవిచూడటం పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇంకోవైపు మెగా బ్రదర్ నాగబాబు తొలిసారి ‘నర్సాపురం’ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ రకంగా మెగా ఫ్యామిలీకి రాజకీయంగా 2019 అసలు కలిసిరాలేదు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో జనసేన తరుపున ఒకే ఒక ఎమ్మెల్యే ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టడం కాస్తా ఊరట కలిగించే అంశం. ఏమైనా సినిమాల పరంగా మంచి విజయాలనే నమోదు చేసిన మెగా ఫ్యామిలీకి రాజకీయ పరంగా మాత్రం అపజయాలే పలకరించాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 31, 2019, 8:35 AM IST