టాలీవుడ్ హాట్ కపుల్ నాగ చైతన్య, సమంతకు ఈ ఇయర్ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీళ్లిద్దరు తొలిసారి జంటగా నటించినా ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు సమంతతో మ్యారేజ్ తర్వాత హిట్ అన్నదే లేని నాగ చైతన్యకు భార్య సామ్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. మరోవైపు సమంత.. ముఖ్యపాత్రలో నటించిన ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఇక నాగ చైతన్య ఈ ఇయర్ ఎండ్.. తన మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ రకంగా నాగ చైతన్య..అటు భార్యతో పాటు మేనమామతో కలిసి చేసిన ఈ రెండు సినిమాలతో 2019లో వరుసగా రెండు హిట్స్ అందున్నాడు. ఈ రెండు సినిమాల్లో ‘మజిలీ’ క్లాస్ మూవీ అయితే.. ‘వెంకీ మామ’లో మాత్రం మాస్ లుక్‌తో అలరించాడు. అంతేకాదు.. తనకు మాస్ సినిమాలు సెట్ కావన్న దానికి ‘వెంకీ మామ’ సినిమాతో మంచి బదులే ఇచ్చాడు చైతూ. ఈ రకంగా 2019లో సమంతతో పాటు నాగ చైతన్యకు వెరీ స్పెషల్ అనే చెప్పాలి. దీంతో వీళ్లిద్దరు ఈ ఇయర్ ఎండ్‌ను గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి 2019 భార్య భర్తలైన సమంత, నాగ చైతన్యలకు మరిచిపోలేని సంవత్సరం అనే చెప్పాలి. త్వరలో వీళ్లిద్దరు గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో కలిసి నటించబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha Ruth Prabhu, Telugu Cinema, Tollywood