మీ గొడవలతో నన్ను బలి చేయొద్దు.. రానాకు దర్శకుడి విన్నపం..
అదేంటో కానీ రానా దగ్గుబాటి మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీలకు దగ్గరగానే ఉంటాడు. ఆయన ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి వివాదాలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

రానా దగ్గుబాటి ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: November 2, 2019, 9:57 AM IST
అదేంటో కానీ రానా దగ్గుబాటి మాత్రం ఎప్పుడూ కాంట్రవర్సీలకు దగ్గరగానే ఉంటాడు. ఆయన ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి వివాదాలు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన ప్రస్తుతం అరజడన్ సినిమాలకు పైగానే నటిస్తున్నాడు. అందులో ఏది ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్నాడు మరి. దానికితోడు ఈ మధ్య అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరమయ్యాడు రానా. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ఈయన నటిస్తున్న 1945 సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఈ పోస్టర్ విడుదలైన వెంటనే రానా కూడా సంచలన ట్వీట్ చేసాడు. ఈ సినిమాతో తనకు సంబంధం లేదని.. అసలు ఇప్పుడు ఉన్నట్లుండి ఫస్ట్ లుక్ ఎందుకు విడుదల చేసారో కూడా తెలియదని చెప్పాడు. దానికితోడు ఇది ఒక పూర్తికాని సినిమా అంటూ నిర్మాతపై మండిపడ్డాడు. సగం పూర్తైన సినిమాకు విడుదల తేదీని ఎలా ప్రకటిస్తారో తెలియదంటూ రెచ్చిపోయాడు. అసలు ఇలాంటి సినిమాలను, నిర్మాతలను నమ్మొద్దంటూ ట్వీట్ చేసాడు. దీనిపై నిర్మాత కూడా సీరియస్ అయ్యాడు. సినిమా పూర్తైందో లేదో దర్శకుడు చూసుకుంటాడులే అన్నట్లు ట్వీట్ చేసాడు.
దానికి రానా కూడా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలాంటి సమయంలో దర్శకుడు శివ మధ్యలోకి వచ్చేసాడు. ఈ సినిమా పూర్తైందని.. ఇప్పటికే శాటిలైట్ బిజినెస్ కూడా జరిగిపోయిందని చెప్పాడు. సినిమా ఫైనల్ వెర్షన్ కూడా చూసుకున్నానని.. అది కూడా బాగా వచ్చిందని చెప్తున్నాడు దర్శకుడు శివ. రానా తమిళ వెర్షన్ డబ్బింగ్ కూడా చెప్పాడని ఆయన చెబుతున్నాడు.

కానీ రానా మాత్రం సినిమా ఇంకా పూర్తి కాలేదంటూ ట్వీట్ చేసాడు. ఈ సందర్భంలో తన కెరీర్‌తో ఆడుకోవద్దని.. నిర్మాతకు మీకు మధ్యలో ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలంటూ హీరో రానాకు ఆయన విన్నవించుకుంటున్నాడు. మొత్తానికి నిర్మాత, హీరో మధ్యలో పడి దర్శకుడు అప్పడం అయిపోతున్నాడిక్కడ. జనవరి 24, 2020న సినిమా విడుదలవుతుందని నిర్మాత ట్వీట్ చేసాడు.

1945 సినిమాలో రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి (Image:RanaDaggubati/Instagram)

Loading...