హోమ్ /వార్తలు /సినిమా /

Model Suicide: 18 ఏళ్ల మోడల్ సూసైడ్.. కలకలం రేపుతోన్న వరుస ఆత్మహత్యలు

Model Suicide: 18 ఏళ్ల మోడల్ సూసైడ్.. కలకలం రేపుతోన్న వరుస ఆత్మహత్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాస్‌, తన అమ్మమ్మతో పాటు కలిసి ఉంటుంది. 17 సంవత్సరాలుగా తన తండ్రికి దూరం కావడంతో మేనమామ వద్ద నివసిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

బెంగాల్ రాష్ట్రంలో ప్ర‌ముఖ మోడ‌ల్స్ వరుస ఆత్మ‌హ‌త్య‌లు (Model Suicides) సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో నలుగురు మోడల్స్​ ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ ఘటనలు మరువక ముందే మరో మోడల్ ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా 18 ఏళ్ల ఔత్సాహిక మోడల్‌ ఆదివారం తన గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని కస్బాలోని బేడియాదంగా వద్ద తన గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. ప్రముఖ బెంగాలీ మోడల్‌ సరస్వతీ దాస్‌.. తెల్లవారుజామున 2గంటలకు ఉరి వేసుకుంది. ఆమె అమ్మమ్మ సరస్వతీని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు యత్నించింది. కానీ, అప్పటికే సరస్వతీ దాస్‌(saraswathi das) మృతిచెందినట్లు నిర్దరణ అయింది.

ఇంట్లో కుంటుంబ సభ్యులు ఎవరూ లేరు. దాస్‌, తన అమ్మమ్మతో పాటుగా ఉంది. రాత్రి ఇద్దరూ కలిసి నిద్రపోయారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సరస్వతి పక్కన లేకపోవడంతో ఆమె అమ్మమ్మ కంగారుపడి ఇల్లంత వెతికింది. దీంతో ఆమెకు మరో గదిలో సరస్వతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ చనిపోయిందని తెలిసింది. సరస్వతి తన తల్లి ఆరతి దాస్‌తో కలిసి ఉంటోంది. గత 17 సంవత్సరాలుగా తన తండ్రికి దూరం కావడంతో మేనమామ వద్ద నివసిస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. “మాధ్యామిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక, ఆమె తన చదువును విడిచిపెట్టి, ట్యూషన్ చెప్పడం, మోడలింగ్ చేస్తోంది.

మరోవైపు మోడల్‌ సరస్వతీ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. కొంతకాలంగా ఆమె తీవ్రమైన ఒత్తిడితో డిప్రెషన్‌లో కొట్టుమిట్టాడుతోందని కోల్‌కతా పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆమె మాట్లాడిన ఫోన్‌ రికార్డులను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న చోట ఎంలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు తెలిపారు. సరస్వతి దాస్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

First published:

Tags: Kolkata, Suicide, West Bengal, Woman suicide

ఉత్తమ కథలు