Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: January 2, 2019, 3:16 PM IST
విజయ్ అట్లీ కుమార్
అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఒక్క సినిమాలో 16 మంది హీరోయిన్లు ఏంటి విచిత్రం కాకపోతేనూ.. ఎలా ఆ సీన్స్ బ్యాలెన్స్ చేస్తారు.. అసలు అది సాధ్యమయ్యే పనేనా.. ఒకేసారి అంత మందిని సినిమాలో ఎలా చూపిస్తాడు దర్శకుడు.. ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి కదా..! అన్నింటికీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు అట్లీ కుమార్. ఈయనతోనే విజయ్ తర్వాతి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది పేరున్న హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తుంది.

విజయ్ అట్లీ కుమార్
ఈ చిత్రం ఫుట్ బాల్ నేఫథ్యంలో తెరకెక్కుతుంది. ఒలంపిక్స్ విషయంలో జరుగుతున్న అక్రమాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు అట్లీకుమార్. ఇప్పటి వరకు విజయ్ తో ఈయన తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్నే టార్గెట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా నటించబోతున్నాడు విజయ్. ఈ టీం కోసం 16 మంది అమ్మాయిలు కావాలి.

విజయ్ ఫైల్ ఫోటో
అందులో దాదాపు చాలా వరకు పేరున్న ముద్దుగుమ్మల వైపు అడుగేస్తున్నాడు దర్శకుడు అట్లీకుమార్. గతంలో ‘చక్ దే ఇండియా’లో హాకీ కోచ్‌గా నటించాడు కింగ్ ఖాన్. ఇప్పుడు అలాంటి మహిళా టీం కోచ్ పాత్రలోనే విజయ్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. దసరాకు విడుదల కానుంది ఈ చిత్రం. కచ్చితంగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు విజయ్-అట్లీకుమార్. మరి ఒకే సినిమాలో 16 మంది హీరోయిన్లు అంటే స్క్రీన్ ఎలా ఉండబోతుందో ఊహించుకోడానికి కూడా రావడం లేదు కదా.
పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
Published by:
Praveen Kumar Vadla
First published:
January 2, 2019, 3:15 PM IST