హోమ్ /వార్తలు /సినిమా /

‘118’ ఆడియో ఫంక్షన్‌.. ఒకే వేదికపై బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్..

‘118’ ఆడియో ఫంక్షన్‌.. ఒకే వేదికపై బాలకృష్ణ,ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్..

బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్

బాలయ్య ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్

118 Pre Release Event | హ‌రికృష్ణ‌ చ‌నిపోయిన త‌ర్వాత నంద‌మూరి కుటుంబం మ‌ళ్లీ క‌లిసిపోయింది. ఏడేళ్లుగా మాట్లాడుకోని బాల‌య్య‌, క‌ళ్యాణ్ రామ్ కుటుంబాలు మ‌ళ్లీ క‌లిసిపోయాయి. తాాజాగా ఈ ముగ్గురు నందమూరి హీరోలు..కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ వేదికగా మరోసారి ఒకటయ్యారు. 

ఇంకా చదవండి ...

    హ‌రికృష్ణ‌ చ‌నిపోయిన త‌ర్వాత నంద‌మూరి కుటుంబం మ‌ళ్లీ క‌లిసిపోయింది. ఏడేళ్లుగా మాట్లాడుకోని బాల‌య్య‌, క‌ళ్యాణ్ రామ్ కుటుంబాలు మ‌ళ్లీ క‌లిసిపోయాయి. ఇప్పుడు నాన్న లేని జూనియ‌ర్, క‌ళ్యాణ్ రామ్ కు తానే నాన్న‌లా మారిపోయాడు బాల‌య్య‌. పిల్ల‌లకు పెద్ద‌దిక్కుగా ఉన్నాడు.


    ఆ మ‌ధ్య బాల‌య్య న‌టించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ఆడియో వేడుక‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఇద్ద‌రూ వ‌చ్చారు. దానికి ముందు అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ కు బాల‌య్య ఛీఫ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. తాాజాగా ఈ ముగ్గురు నందమూరి హీరోలు..కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ వేదికగా మరోసారి ఒకటయ్యారు.


    కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరై  ఈ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందజేశారు. కళ్యాణ్ రామ్ సరసన షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నారు.

    First published:

    Tags: Balakrishna, Jr ntr, Kalyan Ram Nandamuri, NTR, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు