‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో ఎన్ని పాటలున్నాయో తెలుసా..ఫ్యాన్స్‌కు పండగే..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై  టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో మొత్తంగా 11 పాటలు ఉన్నాయని చెబుతున్నారు.

news18-telugu
Updated: December 4, 2018, 12:50 PM IST
‘ఎన్టీఆర్..కథానాయకుడు’లో ఎన్ని పాటలున్నాయో తెలుసా..ఫ్యాన్స్‌కు పండగే..!
రావణుడిగా బాలకృష్ణ
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై  టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

మహానటుడు రామారావు జీవితాన్ని ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి..ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని ..‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పేరుతో రామారావు ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దాదాపు 60కి పైగా పాత్రలు పోషించనున్న బాలకృష్ణ


మరోవైపు రామారావు...రాజకీయ ప్రస్థానాన్ని ‘ఎన్టీఆర్..మహానాయకుడు’ పేరుతో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న 15 రోజుల వ్యవధిలో రిలీజ్ చేయనున్నారు.ఎన్టీఆర్ బయోపిక్


రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ‘ఘనకీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా..అంటూ రిలీజ్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత అచ్చమైన తెలుగు పదాలతో రిలీజ్ చేసిన ఈ పాట కథానాయకుడిగా ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలిపేలా ఉంది.

పంచకట్టులో బాలకృష్ణ
Loading...
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఈ పాటతో పాటు ఇంకా 10 పాటలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో 4 బిట్ సాంగ్స్ ఉన్నాయట. మాములుగా బాలయ్య స్టెప్పులకు బీసీ సెంటర్స్‌ ఫుల్‌గా ఎంజాయి చేస్తారు. ఈ బయెపిక్‌లో వేటగాడులో ఆకుచాటు పిందే తడిసే పాటతో పాటు..‘అడవిరాముడు’ ఆరేసుకోబోయి వంటి మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఈ పాటలకు థియేటర్స్‌లో ఆడియన్స్‌ పూనకాలు రావడం ఖాయం అని చెబుతున్నారు. మొత్తానికి ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు పెరిగాయి.

‘ఎన్టీఆర్’ కథానాయకుడులో బాలయ్య, రకుల్‌పై వేటగాడు మూవీ ఆకుచాటు పాటను పిక్చరైజ్ చేసిన మూవీ యూనిట్


‘ఎన్టీఆర్’ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌ను డిసెంబర్ 16న తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈమూవీ ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో కంపెనీ లహరి  రూ.2 కోట్లకు భారీ ధరకు చేజిక్కించుకుంది. ఇక అదే రోజు ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.


ఇది కూడా చదవండి 

#NTRBiopic:ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా..

ఎన్టీఆర్ పోస్ట‌ర్.. అన్న‌గారు అడుగుతో అభిమానుల‌కు పూన‌కాలే..

నందమూరి హీరోల అరుదైన రికార్డు
First published: December 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...