Home /News /movies /

10TH CLASS DAIRIES MOVIE REVIEW AND RATING A FEEL GOOD LOVE STORY TA

10Th Class Dairies Movie Review : 10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ.. ఫీల్ గుడ్ స్కూల్ డ్రామా మెమరీస్..

10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ (Twitter/Photo)

10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ (Twitter/Photo)

10Th Class Dairies Movie Review : శ్రీరామ్, అవిక గోర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యం రాజేశ్, నాజర్ నటించిన మూవీ 10Th క్లాస్ డైరీస్. అమెరికాలో ఉంటున్న ఎన్నారై తన జీవితంలో ఎప్పుడో వదిలేసిన ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నంలో పడి తన పదో తరగతి క్లాస్‌ మెట్స్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రాజమండ్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తాను కోరుకున్న ఆనందాన్ని తిరిగి పొందాడా లేదా అనేది సినిమా స్టోరీ.

ఇంకా చదవండి ...
  రివ్యూ : 10Th క్లాస్ డైరీస్
  నటీనటులు : శ్రీరామ్, అవిక గోర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యం రాజేశ్, నాజర్, సంజయ్ స్వరూప్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, గీతా సింగ్, జబర్దస్త్ రొహిణి తదితరులు
  ఎడిటర్: ప్రవీణ్ పూడి
  సినిమాటోగ్రఫీ:
  సంగీతం: సురేష్ బొబ్బిలి
  నిర్మాతలు : అచ్చుత రావు, రవితేజ మన్యం                                                                           దర్శకత్వం, సినిమాటోగ్రఫీ :  గరుడవేగ అంజి                                                         విడుదల తేది : 1/7/2022  కథ.. 

  సోము అలియాస్ సోమయాజి (శ్రీరాం) అమెరికాలో స్వయంకృషితో ఎదిగి ఓ కంపెనీకి సీఈవోగా ఎదుగుతాడు.  జీవితంలో సుఖసంతోషాలకు దూరంగా బతుకుతుంటాడు. ఈ క్రమంలో సైక్రియాటిస్టు వద్దకు వెళితే.. నీవు అన్ని రకాలుగా సంపాదించావు. కానీ నీ జీవితంలో ఆనందం లేదని చెబుతాడు. అయితే తన జీవితంలో ఎప్పుడో వదిలేసిన ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నంలో పడి తన పదో తరగతి క్లాస్‌ మెట్స్‌ను కలిసేందుకు అమెరికా నుంచి రాజమండ్రికి చేరుకుంటారు.రాజమండ్రికి చేరుకొన్న తర్వాత సోముకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చిన్నతనంలో తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చాందినీ (అవికా గోర్)ని కలుసుకున్నాడా ? లేదా అనేది చూడాలి.

  కథనం.. 

  సోమయాజి (శ్రీరామ్) అమెరికాలో టాప్ బిజినెస్‌మెన్‌గా ఎదిగి.. వైవాహిక జీవితంలో వైఫల్యం చెందిన సోము లైఫ్‌తో కథ ఎమోషనల్‌గా మారుతుంది. సైక్రియాటిస్ట్ చెప్పిన ప్రకారం  సోమును ఎమోషనల్‌గా టచ్ చేయడంతో రాజమండ్రికి చేరుకోవడం, స్నేహితులతో కలిసి సరదాగా గడపడం లాంటి సన్నివేశాలు చకచకా సాగిపోతాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ మరింత ఎమోషనల్‌‌గా సాగుతాయి. క్లైమాక్స్ చివరి సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈ సినిమాను మరింత బలమైన ఎమోషనల్ సీన్స్‌తో తెరకెక్కించి ఉంటే ఇంకాస్తా మెరుగ్గా ఉండేది.

  ప్రముఖ నిర్మాత వెన్నెల రామారావు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమాటోగ్రఫర్ అంజి డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టుకున్నారు. గతంలో రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాను కూడా సినిమాటోగ్రఫర్ ఎస్.గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేయడం విశేషం. అంజి సినిమాటోగ్రఫర్‌గా తనకున్న అనుభవం దర్శకుడిగా అంజికి ఉపయోగపడింది. సినిమాటోగ్రఫర్ కాబట్టి.. కాబట్టి ఒక దర్శకుడిగా తనకు కావాల్సిన సన్నివేశాలను తెరపై చక్కగా ఆవిష్కరించాడు.

  నటీనటుల విషయానికొస్తే.. 

  సోము పాత్రలో శ్రీరామ్ పాత్ర అద్భుతంగా ఉంది. ఆ పాత్రలో ఒదిగి తీరు చూస్తుంటే.. ప్రేక్షకులు పాత రోజుల్లోకి వెళ్లి పోతారు. స్వతహాగా మంచి నటుడైన శ్రీరామ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అవికా గోర్.. చాందిని పాత్రలో నటించింది అనే కంటే జీవించిందనే చెప్పాలి. క్లైమాక్స్ సీన్‌లో భుజాలపై నడిపించింది. సినిమా అయిపోయిన తర్వాత అవికా గోర్ చేసిన చాందిని పాత్ర ప్రేక్షకులను వెంటాడుతోంది.

  ఇక నిర్మాత వెన్నెల రామారావు గౌరవ్‌గా, హాఫ్ బాయిల్డ్ పాత్రలో శ్రీనివాస్‌రెడ్డి చక్కటి కామెడీతో కితకితలు పెట్టారు.  శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తనదైన శైలిలో హాస్యాన్ని పండించిన వెన్నెల రామారావుకు నటుడిగా మంచి ఆఫర్లు రావడం పక్కా అని చెప్పొచ్చు.  ఇప్పటి వరకు హిమజకు డిఫరెంట్ ఇమేజ్ ఉండేది. కానీ నాగలక్ష్మి పాత్రలో హిమజ కలెక్టర్‌ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకుంది. అర్చన వేద కూడా తన పాత్రతో ఆకట్టుకు  నాజర్ ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచింది.

  టెక్నిషియన్స్  విషయానికి వస్తే..

  ఈ సినిమా సన్నివేశాలను హైలెట్‌ చేయడంలో సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ కీ రోల్ పోషించింది. రీసెంట్‌గా విరాట పర్వం సినిమాకు అద్భుతంగా సంగీతం అందించారు. ఇక ఫస్టాఫ్‌లో పాటలు జోష్‌గా సాగితే.. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా ఉంటాయి. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శృతి కార్తీక్ అందించిన డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. నిర్మాత వెన్నెల రామారావు, రవితేజ మన్యం అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

  10th క్లాస్ డైరీస్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇప్పటి వరకు వచ్చిన రీ యూనియన్ సినిమాకు భిన్నంగా ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కొత్త పాయింట్‌ తీసుకొని సినిమాను ఎమోషనల్‌గా మార్చారు. అవికా గోర్, శ్రీరాం నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. కామెడీ సీన్లు, ఫన్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయి. స్కూల్, కాలేజీ జీవితంలోని అనుభవాలను ఈ సినిమా గుర్తు చేసేలా ఉంటుంది. వారాంతంలో ఫీల్‌గుడ్, ఎమోషనల్ సినిమాలను చూడాలనే వారికి 10th క్లాస్ డైరీస్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

  ప్లస్ పాయింట్స్

  కథ, కథనం

  నటీనటుల నటన

  కెమెరా వర్క్

  మైనస్ పాయంట్స్

  కమర్షియల్ అంశాలు లేకపోవడం

  ఫస్టాఫ్ స్లో

  చివరి మాట.. మొత్తంగా 10Th క్లాస్ డైరీస్ ఫీల్ గుడ్ మూవీ డ్రామా..

  రివ్యూ అండ్ రేటింగ్.. 2.75/5
  First published:

  Tags: Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు