Hansika Motwani: తెలుగు సినీ పరిశ్రమలో తెరపై కొత్త కొత్త కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ మధ్య తెరకెక్కనున్న కథలన్నీ కాస్త కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది. అంతే కాకుండా లవ్ స్టోరీ వంటి కథలను కూడా కాస్త కొత్తదనంతో ని పరిచయం చేస్తున్నారు.ఇక పాన్ ఇండియా సినిమాలు కూడా తెలుగులో బాగా తెరకెక్కనున్నాయి. ఇదిలా ఉంటే మరో సరికొత్త కథతో ఓ సినిమా తెరకెక్కనుంది.
తెలుగు స్క్రీన్ పై తొలిసారిగా ఒకే ఒక్క పాత్రతో ఎటువంటి ఎడిటింగ్ లేకుండా.. ఉత్కంఠభరితంగా సాగిపోయే కథతో తెరకెక్కుతున్న సినిమా '105 మినిట్స్ '. ఈ సినిమా టైటిల్ కాస్త ఆసక్తిగా అనిపించగా.. ఈ సినిమా మొత్తానికి డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు డిఫరెంట్ కథ తో తెరకెక్కనుందని అర్థమవుతుంది. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆసక్తిగా ఉండటంతోపాటు, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా రుద్రాన్ష్ సెల్యులాయిడ్ పతాకంపై బొమ్మ శివ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో హన్సిక ముఖ్య పాత్రలో నటించనుంది. ఇక ఈ సినిమాను డైరెక్టర్ రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ విధంగా డైరెక్టర్ కొన్ని విషయాలు మాట్లాడుతూ.. సింగల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ రియల్ టైం, రీల్ టైమ్ అనేవి ఈ సినిమాకు హైలెట్స్ అని, ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో హీరోయిన్ డిఫరెంట్ పాత్రలో నటించనుందని తెలిపారు.
ఇక హన్సిక మాట్లాడుతూ.. ఈ సినిమా తన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపింది. సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ..ఈ సినిమా మేకింగ్ తనకు చాలెంజ్ అని తెలిపారు. ఇక సినీ నిర్మాత శివ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా తన బ్యానర్ లో నిర్మించడం తనకు సంతోషంగా ఉందని, ఈ సినిమా విలువలు ఎక్కడ తగ్గకుండా కమర్షియల్ హంగులతో నిర్మిస్తున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 105 minuttess, Hansika motwani, Indian screen, Innovative experiment, Tollywood heroine