Singer Sunitha- Ram: సునీత‌కు భ‌ర్త స‌ర్‌ప్రైజ్‌.. స్టేజ్‌పైనే ఏడ్చేసిన గాయ‌ని

సునీత రామ్

Singer Sunitha- Ram: గ‌త కొన్ని నెల‌లుగా టాప్ 1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా దూసుకుపోతోంది స్టార్ మా. ఇక ఈ రేటింగ్‌ని ఇలానే కంటిన్యూ చేసేందుకు ఛానెల్ నిర్వాహ‌కులు ప‌లు ప్లాన్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో బుల్లితెర వీక్ష‌కుల‌కు మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ప‌లు ప్రోగ్రామ్‌ల‌ను తీసుకొస్తున్నాయి

  • Share this:
    Singer Sunitha- Ram: గ‌త కొన్ని నెల‌లుగా టాప్ 1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా దూసుకుపోతోంది స్టార్ మా. ఇక ఈ రేటింగ్‌ని ఇలానే కంటిన్యూ చేసేందుకు ఛానెల్ నిర్వాహ‌కులు ప‌లు ప్లాన్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో బుల్లితెర వీక్ష‌కుల‌కు మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ప‌లు ప్రోగ్రామ్‌ల‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆదివారం స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ షోలు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతుండ‌గా.. వాటితో పాటు మ‌రిన్ని విభిన్న ప్రోగ్రామ్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బిగ్‌బాస్ నాలుగు సీజ‌న్ల‌లో పాల్గొన్న వారితో రెండు వారాల పాటు ఫ‌న్ చేయించారు. ఇక తాజాగా రీల్ అండ్ రియ‌ల్ కపుల్స్‌తో సంద‌డి చేయించ‌బోతున్నారు. 100 ప‌ర్సెంట్ ల‌వ్ పేరుతో ఒక ప్ర‌త్యేక షో ఈ ఆదివారం రాబోతోంది.

    ఇందులో ఆరు మంది రియ‌ల్ లైఫ్ క‌పుల్స్, ఆరు మంది రీల్ కపుల్స్ పాల్గొన‌బోతున్నారు. వారిలో నిరుప‌మ్ ప‌రిటాల‌- మంజుల‌, మ‌ధు- ప్రియాంక నాయుడు, శ్రీహ‌న్-సిరి, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్- రాధా రాజ‌శేఖ‌ర్‌, సుహాసిని- ధ‌ర్మ‌, ష‌ణ్ముఖ్‌- దీప్తి సున‌య‌న‌, అవినాష్- అరియానా తదితరులు  ఉన్నారు.



    ఇక ఈ షోకు ర‌వి, వ‌ర్షిణి యాంక‌ర్లుగా చేయ‌బోతున్నారు. అంతేకాదు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ గెస్ట్‌గా వ‌స్తుండ‌గా.. ఇటీవ‌లే రెండో పెళ్లి చేసుకున్న సింగ‌ర్ సునీత‌- రామ్ న‌ర‌ప‌నేని కూడా 100 ప‌ర్సెంట్ ల‌వ్‌కి రాబోతున్నారు. ఇక ఈ షోలో సునీత‌కు రామ్ న‌ర‌ప‌నేని స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డం, ఆమె భావోద్వేగానికి గురి అవ్వ‌డం ప్రోమోలో చూపించారు. మ‌రి ఈ క‌పుల్స్ అంద‌రూ చేసిన హ‌డావిడి ఎలా ఉందో చూడాలంటే మ‌రో ఐదు రోజులు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published: