Home /News /movies /

10 TEN SCARY TELUGU SERIALS EARLYS 1990S IN TELUGU TV NR

Scary Telugu Serials: ఒకప్పుడు ప్రసారమైన ఈ దెయ్యం సీరియల్స్ మీకు గుర్తున్నాయా?

scary telugu serials

scary telugu serials

Scary Telugu Serials: అప్పట్లో సీరియల్స్ ఆడపడుచులే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చూసే వాళ్లు. సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతారు.

    Scary Telugu Serials: అప్పట్లో సీరియల్స్ ఆడపడుచులే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చూసే వాళ్లు. సీరియల్ సమయానికంటే ముందే టీవీల ముందు వాలిపోతారు. కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర కూర్చొని సీరియల్ చూస్తుంటే ఏదో పెద్ద థియేటర్ కు వెళ్లి ఫ్యామిలీ మూవీ చూసినట్టుగా అనిపించేది. ఇక అప్పట్లో సీరియల్స్ కథలు కూడా కాస్త భిన్నంగా ఉండటమే కాకుండా పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకునేవి.

    ఇక కొన్ని సీరియల్స్ భయంకరంగా ఉండేవి. దేవుళ్ల నేపథ్యంలో, దయ్యాల నేపథ్యంలో, కొన్ని రహస్య విషయాల నేపథ్యంలో ఇలా బాగా ప్రసారం అయ్యేవి. ఇవి చూడటానికి ఎంతో ఆసక్తిగా అనిపించినా.. చూసేటప్పుడు చాలా భయమేసేవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని భయంతో చూడబుద్ధి కాకున్నా.. ఆ ఆసక్తితో లోపల భయాన్ని ఉంచుకొని మరి చూసేవి. ఇంతకీ అలా భయం పుట్టించిన సీరియల్స్ ఏంటో చూద్దాం..

    ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత సీరియల్. ఈ సీరియల్ చూడటానికి భయంగా అనిపించేది.కాని చాలా ఆసక్తిగా ఉండేది. ఇక మర్మదేశం సీరియల్ ఇందులో గుర్రం బాగా భయంకరంగా అనిపించేది. ఇక నాగమ్మ సీరియల్. ఈ సీరియల్ లో పాము ని చూస్తే తెగ భయమేసేది.

    ఇక మరో సీరియల్ రహస్యం. ఇది ఆలయం గురించి రహస్యాలు చూపించే వాళ్ళు. స్టార్ మా లో ప్రసారమైన తులసిదళం సీరియల్ కూడా బాగా ఆసక్తిగా ఉండేది. ఇక ఈ టీవీలో ప్రసారమైన నాగాస్త్రం సీరియల్.. నాగుపాము నేపద్యంలో వచ్చిన ఏ సీరియల్స్ అయినా భయంగా అనిపించేది. అంతేకాకుండా అలౌకిక సీరియల్ కూడా భయంతో ఆసక్తిగా ఉండేది.

    ఇక మాయా వృక్షం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరో సీరియల్ మనోయజ్ఞం. ఈ సీరియల్ దైవ నేపద్యంలో ప్రసారమవ్వగా అందులో ఉన్న మాంత్రికుడిని చూస్తే అప్పట్లో ప్రజలు తెగబయపడేవాళ్లు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anveshitha, Devil serials, Marmadesham, Maya vruksham, Nagamma serial, Rahasyam, Scary Telugu Serials, Telugu serials

    తదుపరి వార్తలు